పవన్ "ఉస్తాద్ భగత్ సింగ్" లేటెస్ట్ షెడ్యూల్ ఆ తేదీ నుండి ప్రారంభం..!

Pulgam Srinivas
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం టాలీవుడ్ టాప్ డైరెక్టర్ లలో ఒకరు అయినటువంటి హరిష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ అనే మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ మూవీ లో శ్రీ లీల ... పవన్ సరసన హీరోయిన్ గా నటిస్తుండగా ... రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. మైత్రి సంస్థ వారు భారీ బడ్జెట్ తో ఈ మూవీ ని నిర్మిస్తున్నారు. ఇకపోతే ఈ మూవీ తమిళ్ లో సూపర్ హిట్ విజయం సాధించినటువంటి తేరీ మూవీ కి రీమేగా రూపొందుతున్నట్లు ఓ వార్త గత కొన్ని రోజులుగా వైరల్ అవుతుంది.


ఇకపోతే ఈ మూవీ మేకర్స్ మాత్రం ఇందుకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటనను విడుదల చేయలేదు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ప్రారంభం అయ్యి కొంత భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నుండి ఈ చిత్ర బృందం ఇప్పటికే ఒక చిన్న వీడియోను అలాగే కొన్ని పోస్టర్ లను విడుదల చేయగా వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లేటెస్ట్ షెడ్యూల్ స్టార్ట్ కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ యొక్క లేటెస్ట్ షూటింగ్ షెడ్యూల్ ఈ నెల 20 వ తేదీ నుండి ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.


ప్రస్తుతం ఎలక్షన్ లు కూడా దగ్గరకు రావడంతో పవన్ వీలును బట్టి ఈ సినిమా షూటింగ్ కొనసాగనున్నట్లు మధ్యలో పవన్ కి ఏదైనా పని పడినట్లయితే ఈ సినిమా షూటింగ్ మళ్లీ వాయిదా పడి అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ మూవీ పై మాత్రం తెలుగు సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలను నెలకొని ఉన్నాయి. పవన్ ఈ సినిమాతో పాటు సుజిత్ దర్శకత్వంలో ఓజి లోనూ ... క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: