నందమూరి బాలకృష్ణ తాజాగా భగవంత్ కేసరి అనే సినిమాలో హీరో గా నటించాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా ... శ్రీ లీల ఈ మూవీ లో బాలకృష్ణ కు కూతురు పాత్రలో నటించింది. షైన్ స్క్రీన్ బ్యానర్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాకు ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించగా ... అర్జున్ రాంపాల్ ఈ మూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు. ఈ సినిమాలో శ్రీకాంత్ ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ మూవీ ని అక్టోబర్ 19 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు.
ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడిన నేపథ్యంలో తాజాగా ఈ చిత్ర బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేశారు. ఇకపోతే సెన్సార్ బోర్డు నుండి ఈ సినిమాకు యు / ఏ సర్టిఫికెట్ లభించినట్లు తెలుస్తోంది. ఇకపోతే సెన్సార్ బోర్డు నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ లోని ఇంట్రవెల్ సన్నివేశం అదిరిపోయే రేంజ్ లో ఉండబోతున్నట్లు అక్కడ వచ్చే సన్నివేశం ఈ సినిమాజే హైలైట్ గా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. అలాగే ఈ మూవీ లోని ఇంటర్వెల్ సన్నివేశానికి తమన్ అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను ఇచ్చినట్లు ఈ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో తమన్ కి మరోసారి అదిరిపోయే రేంజ్ లో ప్రేక్షకుల నుండి ప్రశంసలు లభించబోతున్నట్లు తెలుస్తోంది.
ఇకపోతే ఈ సారి దసరా పండుగకు భగవంత్ కేసరి మూవీ తో పాటు టైగర్ నాగేశ్వరరావు , లియో సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర విడుదల కాబోతున్నాయి. ఈ మూడు మూవీ లపై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఇందులో భగవంత్ కేసరి ఏ స్థాయి విజయాన్ని అందుకొని ఇతర మూవీల నుండి పోటీని తట్టుకుంటుందో చూడాలి.