థైస్ తో వయ్యారలు ఒలకబోస్తున్న ఈషా రెబ్బా....!!
ఇక ప్రశాంత్ వర్శ చిత్రం ఆ తో మరింత పాపులర్ అయ్యారు. ఈ సినిమాలో లెస్బియన్ పాత్రలో నటించి మెప్పించారు. ఇక ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఎన్టీఆర్ అరవింద సమేత వీర రాఘవ సినిమాలో నటించి వావ్ అనిపించారు. ఇక ప్రస్తుతం ఓ తమిళ చిత్రంతో పాటు ఓ మలయాళీ చిత్రంలో నటిస్తున్నారు ఈషా రెబ్బా.హాట్ అందాల భామ ఈషా రెబ్బా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తన ఫోటోలతో సామాజిక మాధ్యమాల్లో దుమారం రేపుతుంది ఈషా రెబ్బా. తెలుగు భామ అయిన ఈమెకు టాలీవుడ్ అగ్ర హీరోలెవరు ఛాన్సులు ఇవ్వడం లేదు. తాజాగా బ్లాక్ కలర్ ఔట్‌ఫిట్‌లో ఈషా రెబ్బా షేర్ చేసిన ఫొటోలు ఇంటర్నెట్ షేక్ చేసే విధంగా ఉన్నాయి. ఈషా రెబ్బా డిజైనర్ వేర్‌లో మెరిసింది. తాజాగా వెరైటీ డ్రెస్ వేర్‌లో ఉన్న ఈషా అందాలు చూపు తిప్పుకోలేని విధంగా ఉన్నాయి. రోజా విరబూసినట్లు ఉండే ఆమె చిరునవ్వు కుర్రాళ్ల హృదయాలకు చిల్లులు పెడుతోంది. ఈమె తెలుగులో 'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' సినిమాతో తెరంగేట్రం చేసింది. కానీ 'అంతకు ముందు ఆ తర్వాత' మూవీతో హీరోయిన్‌గా లీడ్ రోల్లో నటించింది. ఆ తర్వాత' మూవీ తర్వాత 'అమీ తుమీ' 'బందిపోటు''అ', 'అరవింద సమేత వీర రాఘవ' చిత్రాలు మాత్రమే ఈషారెబ్బా కు గుర్తింపు తెచ్చిపెట్టాయి. తాజాగా ఈమె అక్కినేని అఖిల్ హీరోగా నటించిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమాలో నటించింది.ఈషా వెండితెరకు పరిచయమై 10 ఏళ్ళు దాటింది. మంచి ఆరంభం లభించినా స్టార్ కావడానికి అవసరమైన బ్రేక్ రాలేదు. సాధారణంగా టాలీవుడ్ సినీ పరిశ్రమలో తెలుగు హీరోయిన్స్ చాలా అరుదు. లోకల్ అని మన హీరోలు ఈమెను లైట్ తీసుకున్నట్టు కనబడుతోంది.
రాగల 24గంటలు మూవీలో మెయిన్ లీడ్ గా చేసింది. ఆ మూవీ అనుకున్నంత విజయం సాధించకపోవడం ఈషా బ్యాడ్ లక్. అందం, టాలెంట్ ఉండి కూడా సరైన గుర్తింపుకు నోచుకోలేకపోతుంది. ప్రస్తుతం ఆమె తమిళ పరిశ్రమపై ఫోకస్ పెట్టింది. రెండు తమిళ చిత్రాలతో పాటు ఓ తెలుగు మూవీలో నటిస్తోంది ఈషా.ఈషా రెబ్బా ఇటీవల హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చిన దయాలో కీలక పాత్రలో నటించింది. జేడీ చక్రవర్తి హీరోగా చేశారు. జేడీ చక్రవర్తి ఈ వెబ్ సిరీస్‌తో ఓటీటీకి పరిచయం అవుతున్నారు. పవన్ సాధినేని దర్శకత్వం వహించారు. తెలుగులో తీసిన సిరీస్ ప్రస్తుతం హిందీ, తమిళ, మలయాళ, కన్నడ, మరాఠీ, బెంగాలీ భాషల్లోనూ కూడా స్ట్రీమింగ్ అవుతోంది. ఈవెబ్ సిరీస్‌లో ఈషా రెబ్బా, రమ్యా నంబీసన్, విష్ణుప్రియ తదితరులు నటించారు.