సంతోషంలో నందమూరి అభిమానులు...!!
నందమూరి మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ సొంత బ్యానర్ లో తెరకెక్కే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. మోక్షజ్ఞ తొలి సినిమా తోనే పాన్ ఇండియా రేంజ్ లో ఇండస్ట్రీ ని షేక్ చేయనున్నారని మాస్, యాక్షన్ ప్రేక్షకులను సైతం అలరించే విధం గా ఈ సినిమా ఉండనుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. మోక్షజ్ఞ తొలి సినిమా లో బాలయ్య కూడా కీలక పాత్రలో కనిపిస్తారని భోగట్టా.ఇప్పటికే తన లుక్ ను మార్చుకున్న మోక్షజ్ఞ వరుసగా సినిమాలలో నటించేలా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. మోక్షజ్ఞ రేంజ్ రాబోయే రోజుల్లో మరింత పెరగాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్ డైరెక్టర్లు మోక్షజ్ఞ పై దృష్టి పెడతారేమో చూడాలి. మోక్షజ్ఞ తన సినిమాలు ఇతర భాషల్లో సైతం సక్సెస్ సాధించే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారని తెలుస్తోంది.