టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కొడుకుగా సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం తనకంటూ తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్న అక్కినేని అఖిల్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటుడు వి వి వినాయక్ దర్శకత్వంలో రూపొందిన అఖిల్ మూవీ తో హీరో గా వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఇక ఆ తర్వాత హలో , మిస్టర్ మజ్ను , మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ , ఏజెంట్ మూవీ లలో హీరోగా నటించాడు. ఇందులో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది.
ఇకపోతే ఈ సినిమా తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఏజెంట్ అనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో అఖిల్ హీరోగా నటించాడు. మొదట ఈ మూవీ ని పాన్ ఇండియా మూవీ గా విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం ప్రకటించింది. కాకపోతే ఆ తర్వాత మాత్రం ఈ సినిమాను కేవలం తెలుగులో మాత్రమే విడుదల చేశారు. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను కూడా ఆశించిన స్థాయిలో ఆకట్టు కోలేక పోయింది. ఇక చివరకు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అఖిల్ తన తదుపరి మూవీ కి సంబంధించిన ప్లాన్స్ లో ఉన్నట్లు తెలుస్తోంది.
అందులో భాగంగా తాజాగా విరూపాక్ష మూవీ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న కార్తీక్ దండు దర్శకత్వంలో అఖిల్ తన తదుపరి మూవీ ని చేసే ఆలోచనలో ఉన్నట్లు ప్రస్తుతం అందుకు సంబంధించిన పనులు శర వేగంగా జరుగుతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అన్ని అనుకున్నట్లు జరిగితే అఖిల్ , కార్తీక్ కాంబినేషన్ లో ఓ మూవీ రూపొందే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.