క్యూ లో వస్తున్న కూతురు సెంటిమెంట్ !

Seetha Sailaja
వందల కోట్లు ఖర్చుపెట్టి భారీ బడ్జెట్ సినిమాలు తీసినప్పటికీ ఆసినిమాలో సరైన సెంటిమెంట్ సీన్స్ లేకపోతే మన ప్రేక్షకులు ఆసినిమా పై పెదవి విరుస్తారు. దీనితో ఏదోఒక సెంటిమెంట్ ను నమ్ముకుని దర్శకులు సినిమాలు తీయవలసిన పరిస్థితి. దసరా రేస్ కు రాబోతున్న ‘భగవంత్ కేసరి’ ‘లియో’ సినిమాలు రెండు కూతురు సెంటిమెంట్ చుట్టూ తిరుగుతాయని లీకులు వస్తున్నాయి.

బాలకృష్ణ నట విశ్వరూపం కనిపించబోతున్న ‘భగవంత్ కేసరి’ అలాగే కాలీవుడ్ టాప్ హీరో విజయ్ నటించిన ‘లియో’ సినిమాలు రెండు ఒకేరోజున దసరా పండుగను టార్గెట్ చేస్తూ విడుదల కాబోతున్నాయి. దీనితో బాలకృష్ణ విజయ్ ల వార్ లో విజేత ఎవరు అన్న ఆశక్తి చాలమందిలో ఉంది. ఈ రెండు సినిమాలకు దర్శకులుగా వ్యవహరించిన అనీల్ రావిపూడి లోకేష్ కనగరాజు తమ ఇద్దరి సినిమాలలో యాక్షన్ సీన్స్ మాఫియా బ్యాక్ డ్రాప్ తో పాటు కూతురు సెంటిమెంట్ ను విపరీతంగా వాడుకున్నట్లు తెలుస్తోంది.

దసరా వార్ ముగిశాక డిసెంబర్ మొదటి వారంలో విడుదల కాబోతున్న నాని ‘హాయ్ నాన్న మూవీ కూడ పూర్తిగా కూతురి సెంటిమెంట్ చుట్టూ అల్లుకున్న కథ అని అంటున్నారు. ఇక వెంకటేష్ ‘సైంధవ్’ మూవీ కథ కూడ కూతురి సెంటిమెంట్ నేపధ్యం అని తెలుస్తోంది. ఇలా భారీ అంచనాలు ఉన్న ఈ నాలుగు సినిమాలలోను కూతురి సెంటిమెంట్ ను చాల ఎక్కువగా చూపించే సన్నివేశాలు పాటలు కూడ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నాలుగు సినిమాలు భారీ బడ్జెట్ తో తీయడమే కాకుండా ఈ నాలుగు సినిమాలలోను టాప్ హీరోలు నటిస్తూ ఉండటంతో ఇన్ని కూతురు సెంటిమెంట్ సినిమాలు వరసపెట్టి ప్రేక్షకులు బోర్ అన్నది లేకుండా చూస్తారా అన్నది సందేహం.  
ఈ నాలుగు సినిమాలపై వందల కోట్ల స్థాయిలో బిజినెస్ జరిగింది. ఈ నాలుగు సినిమాల కథలు డిఫరెంట్ గా ఉన్నప్పటికీ అంతర్లీనంగా ఈ నాలుగు సినిమాలను శాసించే మెయిన్ పాయింట్ గా కూతురు సెంటిమెంట్..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: