ప్రస్తుతం తెలుగు లో అనేక సీక్వెల్ మూవీస్ రూపొందుతున్నాయి ... మరికొన్ని రూపొందడానికి రెడీగా ఉన్నాయి అవి ఏమిటో తెలుసుకుందాం.
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ప్రస్తుతం పుష్ప పార్ట్ 2 మూవీ రూపొందుతుంది. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు కొన్ని రోజుల క్రితమే ప్రకటించారు.
సిద్దు జొన్నలగడ్డ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా డీజే టిల్లు మూవీ కి కొనసాగింపుగా ప్రస్తుతం టిల్లు స్క్వేర్ మూవీ రూపొందుతుంది.
ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రస్తుతం సలార్ మూవీ రూపొందుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ మొత్తం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ మొదటి భాగం డిసెంబర్ 22 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం ప్రకటించింది.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న దేవర మూవీ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో మరికొన్ని రోజుల్లో ఓ మూవీ స్టార్ట్ కాబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ రెండు లేదా అంతకంటే ఎక్కువ భాగాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.
ప్రభాస్ హీరోగా రూపొందుతున్న "కల్కి 289 బి ఏ డి" సినిమా చాలా బాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న "ఓజి" మూవీ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.
హిట్ పార్ట్ 3 మూవీ షూటింగ్ మరికొంత కాలంలోనే ప్రారంభం కాబోతోంది. ఇందులో నాని హీరోగా నటించబోతున్నాడు.
అడవి శేషు హీరోగా ప్రస్తుతం గూడచారి పార్ట్ 2 మూవీ రూపొందుతుంది.
బాలకృష్ణ హీరోగా అఖండ పార్టు 2 మూవీ రూపొందబోతుంది.
పెదకాపు పార్ట్ 2 మూవీ ఇప్పటికే అనౌన్స్ అయ్యింది.
అఖండ పార్ట్ 2 మూవీ కూడా ఇప్పటికే అనౌన్స్ అయ్యింది.
మా ఊరి పొలిమేర పార్ట్ 2 మూవీ మరికొన్ని రోజుల్లోనే విడుదల కాబోతుంది.
రామ్ పోతినేని హీరోగా ప్రస్తుతం ఈస్మార్ట్ శంకర్ మూవీ కి కొనసాగింపుగా డబల్ ఇస్మార్ట్ మూవీ రూపొందుతుంది.