బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న బ్యూటీస్....!!
మరో ఆరుగురు కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లనున్నారని సమాచారం.అర్జున్ అంబటి, పూజా మూర్తి, సింగర్ భోలే షావలి, యూట్యూబర్ నయని పావని, హాట్ హీరోయిన్ అశ్విని వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం.బిగ్ బాస్ హౌస్ లో ఉన్న గ్లామర్ బ్యూటీ రతిక ఎలిమినేట్ అవ్వడంతో ఆమె స్థానంలో ఎవరు వస్తారా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అనుకున్నట్టే ఇప్పుడు ఇద్దరు హాట్ బ్యూటీలు బిగ్ బాస్ హౌస్ లో సందడి చేయనున్నారు.హాట్ హీరోయిన్ అశ్విని బిగ్ బాస్ హౌస్ లో తన గ్లామర్ తో కట్టిపడేయడం ఖాయం గా కనిపిస్తుంది. తన అందంతో పాటు స్ట్రాటెజిక్ గేమ్ తో ప్రేక్షకులను అలరించబోతుందని సమాచారం.. అలాగే యూట్యూబర్ నయని పావనికి కూడా ఫాలోవర్స్ బాగానే ఉన్నారు. ఈ బ్యూటీ హీరోయిన్ గా మారాలని ఎంతగానో ప్రయత్నిస్తుంది. సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ తన ఫ్యాన్స్ ను అలరిస్తూ ఉంది. ఇన్ స్టా రీల్స్ చేస్తూ తన టాలెంట్ ను ప్రదర్శిస్తుంది. ఈ ఇద్దరు గ్లామర్ బ్యూటీలు బిగ్ బాస్ హౌస్ కు మరింత గ్లామర్ తీసుకురాబోతున్నట్లు సమాచారం.