ఈ ఫోటోలో ఉన్న అబ్బాయిని గుర్తుపట్టారా.. ఇప్పుడు హీరో.!

Divya
2011లో విడుదలైన గోల్కొండ హై స్కూల్ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో సుమంత్, స్వాతి కాంబినేషన్లో తెరకెక్కిన మంచి ఫీల్ గుడ్ సినిమా ఇది. ఇక ఈ సినిమాలో టాలీవుడ్ హీరోగా రాణిస్తున్న సంతోష్ శోభన్ కూడా ఈ సినిమాతోనే మంచి విజయాన్ని సొంతం చేసుకోవడమే కాదు అంతకుమించి పేరు కూడా దక్కించుకున్నారు. క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో చాలామంది కుర్రాళ్ళు నటించిన విషయం తెలిసిందే.
ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే ఒక అబ్బాయి గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అందులో పైన ఫోటోలో కనిపిస్తున్న అబ్బాయి వరుణ్ అనే పాత్రలో చాలా అద్భుతంగా నటించాడు. అప్పుడు ఎంతో బొద్దుగా కనిపించిన ఈ కుర్రాడు ఇప్పుడు మరింత హ్యాండ్సమ్ గా మారిపోయి హీరోగా ప్రశంసలు అందుకుంటున్నాడు. తనదైన నటనతో ఇరగదీస్తూ కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తున్నారు. ఇక ఈ కుర్రాడు ఎవరో కాదు సంగీత్ శోభన్.. సంతోష్ శోభన్ తమ్ముడు. సంగీత్ శోభన్ ఈ సినిమా కంటే ముందు చిన్న ఫ్యామిలీ స్టోరీ వెబ్ సిరీస్ తో ఓటీటీ ప్రేక్షకులను కూడా పలకరించాడు.  అందులో తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన ఈ కుర్రాడు ఇదే కంటిన్యూ చేస్తూ మరో జాతిరత్నం రేంజ్ లో ప్రేక్షకులను అలరిస్తున్నాడు.
ప్రభాస్ తో వర్షం వంటి సూపర్ హిట్ సినిమాలు తీసిన డైరెక్టర్ శోభన్ కొడుకే సంగీత్. దీంతో సహజంగానే నటనపై ఆసక్తి కలిగింది. అలా 2011లో గోల్కొండ హైస్కూల్లో సంతోష్ శోభన్ కీ రోల్ పోషిస్తే చైల్డ్ ఆర్టిస్ట్ గా సంగీత్ శోభన్ కూడా నటించారు. అంతేకాదు ద బేకర్ అండ్ ద బ్యూటీ అనే వెబ్ సిరీస్ లో ఒక స్పెషల్ రోల్ చేసిన సంగీత్ 3 రోజెస్ ,  పిట్టకథలు,  ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ వంటి వెబ్ సీరిస్లలో కూడా మంచి నటుడిగా మెప్పించాడు. ఇప్పుడు మ్యాడ్ సినిమాలో దామోదర్ అనే బీటెక్ కుర్రాడిగా ఆకట్టుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: