ఆ టాలీవుడ్ స్టార్ హీరో నటన అంటే నాకు చాలా ఇష్టం... నేహా శెట్టి..!

Pulgam Srinivas
టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ నటి నేహా శెట్టి ప్రస్తుతం వరుస సినిమాలతో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇక ఇప్పటికే పోయిన సంవత్సరం డిజె టిల్లు మూవీ తో సూపర్ సక్సెస్ ను అందుకున్న ఈ బ్యూటీ ఈ సంవత్సరం కార్తికేయ హీరోగా క్లాక్స్ దర్శకత్వంలో రూపొందిన బెదురులంక 2012 మూవీ లో హీరోయిన్ గా నటించి మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ మూవీ లో ఈ నటి తన నటనతో పాటు అందచందాలతో కూడా కుర్రకారు ప్రేక్షకులను అలరించింది. ఇకపోతే ఈ ముద్దు గుమ్మ తాజాగా రూల్స్ రంజన్ అనే మూవీ లో హీరోయిన్ గా నటించింది.


ఈ సినిమాను అక్టోబర్ 6 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. కిరణ్ అబ్బవరం హీరోగా రూపొందిన ఈ సినిమాకు రత్నం కృష్ణ దర్శకత్వం వహించాడు. ఇకపోతే ప్రస్తుతం ఈ బ్యూటీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తుంది. విశ్వక్ సేన్ ఈ మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఇలా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్న ఈ బ్యూటీ తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొంది. ఆ ఇంటర్వ్యూ లో భాగంగా ఓ టాలీవుడ్ స్టార్ హీరో గురించి ఈ నటి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.


తాజా ఇంటర్వ్యూలో భాగంగా నేహా శెట్టి మాట్లాడుతూ ... నాకు టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి అల్లు అర్జున్ నటన అంటే చాలా ఇష్టం. ఆయన ప్రతి సినిమాకు తన నటనలో వేరియేషన్స్ చూపిస్తూ ఉంటాడు అది నాకు మరింతగా నచ్చుతుంది అని చెప్పుకొచ్చింది. ఇక నేహ శెట్టి తాజాగా అల్లు అర్జున్ గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: