చిరంజీవి,త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా సెట్ అవుతుందా..!?

Anilkumar
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి చేసిన  సినిమాల్లో కొన్ని బ్లాక్ బస్టర్ విజయాలను అందుకోగా మరికొన్ని డిజాస్టర్ గా నిలిచాయి. అయితే ఆ సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే ఇటీవల నటించిన భోళాశంకర్ సినిమా మాత్రం ఊహించని విధంగా పరాజయం పాలయింది. ఈ సినిమా చూసిన తర్వాత మెగా అభిమానులు మెగాస్టార్ వంటి లెజెండ్ చేయాల్సిన సినిమా ఇది కాదు అని ఒక రేంజ్ లో ఫైర్ అయ్యారు. మొదటి నుండి సినిమా పోస్టర్లు విడుదలైనప్పటినుండి ఈ సినిమాపై నెగటివ్ టాక్ వచ్చింది. ఆఖరికి డిజాస్టర్ గా మిగిలింది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ఇంతటి పరాజయం

 తర్వాత మెగాస్టార్ చిరంజీవి కథలను చాలా జాగ్రత్తగా ఎంచుకుంటూ బిజీగా ఉన్నారు. ముఖ్యంగా రీమేక్ జోలికి వెళ్ళకూడదు నీ ఫిక్సయ్యారు. సాధారణంగా కమర్షియల్ కాకుండా ఒక మంచి సినిమాతో ప్రేక్షకులను అలరించాలి అని ఫిక్స్ అయ్యారు. బింబిసారా దర్శకుడు మల్లిడి వశిష్టతో మెగాస్టార్ చిరంజీవి తన తదుపరి సినిమా చేయబోతున్నాడు. చాలా కాలం తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఫాంటసీ చిత్రం తో రాబోతున్నారు. అయితే ఈ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు అని సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

ఇక త్రివిక్రమ్ టాలీవుడ్ లోనే టాప్ డైరెక్టర్స్ లలో ఒకరు. చిరంజీవి త్రివిక్రమ్ కాంబినేషన్ సెట్ అయితే కనక మెగా అభిమానులతో పాటు సినీ అభిమానులందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక ఈ కాంబినేషన్ కి సంబంధించిన అధికారిక ప్రకటన కోసం ఎంత ఆసక్తి ఎదురు చూస్తున్నారు ఫాన్స్. గుంటూరు కారం సినిమా తర్వాత త్రివిక్రమ్ అల్లుఅర్జున్ తో కలిసి సినిమా చేయబోతున్నాడు. అటు అల్లు అర్జున్ పుష్ప టు తర్వాత అట్లీతో సినిమా చేయబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అట్లీ అల్లు అర్జున్ ఒకవేళ అట్లితో సినిమా చేస్తే త్రివిక్రమ్ కి మరో సినిమా చేసేంత సమయం దొరుకుతుంది. ఆ సమయంలో త్రివిక్రమ్ చిరంజీవితో సినిమా చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: