అందుకే పూజ హెగ్డే ను గుంటూరు కారం నుండి తీసేసాము.. నిర్మాత నాగవంశి..!?

Anilkumar
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ సినిమా గుంటూరు కారం. గత కొద్ది రోజుల నుండి ఈ సినిమా విషయంలో వస్తున్న రూమర్స్ మరే సినిమా గురించి కూడా రాలేదు  అని చెప్పాలి. ముందుగా అనుకున్న కథ మారింది అని.. సంగీత దర్శకుడు మారారు అని.. రీ షూట్ చేస్తున్నారు అని.. షూటింగ్ వాయిదా పడుతూ వస్తుంది అని.. చివరికి ఏకంగా ఈ సినిమా నుండి హీరోయిన్ పూజా హెగ్డే తప్పకుంది అని వార్తలు వినిపించాయి. అయితే తాజాగా వాటిపై నిర్మాత నాగ వంశీ స్పందించారు. తాజాగా ఆయన పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో వాటన్నిటినీ ఖండిస్తూ..

 పూజ హెగ్డే సినిమాలో ఎందుకు నటించడం లేదు అన్నదానిపై క్లారిటీ ఇచ్చారు.." ముందుగా ఈ సినిమాని ఆగస్టులో విడుదల చేద్దామని దాని తర్వాత 2024 జనవరి 12 మార్చము అని.. దాంతో కంగారు లేకుండా నెమ్మదిగా షూటింగ్ చేయాలి అని అనుకున్నాం.. కానీ అదే సమయంలో పూజా హెగ్డే మరో హిందీ సినిమా చేయాల్సి ఉంది.. డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఆమెను రీప్లేస్ చేశామూ.. దానికే కొందరు హంగామా ఎందుకు చేశారో నాకు అర్థం కావడం లేదు. పండుగకు రావాల్సిన సినిమాలో ఏ ఏ అంశాలు ఉండాలో అవన్నీ ఈ సినిమాలో తీసుకు వస్తున్నాము. మహేష్ బాబుని చాలా డిఫరెంట్గా చూపిస్తున్నాము. ప్రస్తుతానికి రెండు పాటలు రెడీ అయ్యాయి.

ఫస్ట్ సింగిల్ త్వరలోనే విడుదల అవ్వబోతోంది. సంక్రాంతికి పక్క ఈ సినిమాని రిలీజ్ చేస్తాం. అందులో ఎటువంటి డౌట్ లేదు అని నిర్మాత స్పష్టం చేశారు. దీంతో ఆయన చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమాలో ముందుగా పూజా హెగ్డే శ్రీ లీలను హీరోయిన్లుగా అనుకున్నరు. పూజ హెగ్డే తప్పుకోవడంతో మీనాక్షి చౌదరిని ఫిక్స్ చేశారు. అనంతరం నెక్స్ట్ సినిమాల గురించి నాగ వంశీ మాట్లాడుతూ.. విజయ్ దేవరకొండ హీరోగా గౌతం తిన్ననురి సినిమాలో శ్రీ లీల హీరోయిన్గా నటిస్తోంది. మేము ఎటువంటి మార్పులు చేయడం లేదు. రష్మికను ఎంపిక చేసాము అని ఇటీవల వార్తలు కూడా వచ్చాయి. ఆమెను మేము సంప్రదించలేదు. బాలకృష్ణ బాబీ కాంబినేషన్లో ఒక సినిమా నిర్మిస్తున్నాము. ఇక ఆ సినిమా ఎవరు ఊహించిన విధంగా ఉంటుంది అంటూ వెల్లడించారు నాగ వంశీ..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: