ఎలాంటి పాత్రలోనైనా మెప్పించే చరణ్ కు.. డ్రీమ్ రోల్ ఏంటో తెలుసా?

praveen
మెగాస్టార్ వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన రామ్ చరణ్ ఇప్పుడు తండ్రికి తగ్గ తనయుడిగా పేరు సంపాదించుకున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇక తెలుగు ప్రేక్షకులందరికీ కూడా మెగా పవర్ స్టార్ గా కొనసాగుతూ ఉన్నాడు. అయితే కేవలం డాన్సుల్లోనే కాదు నటన లోనూ మెగాస్టార్ చిరంజీవికి అసలు సిసలైన వారసుడు అన్న విషయం ప్రేక్షకులకు అర్థమయ్యేలా చేసాడు.

 ఎందుకంటే ఇప్పటి వరకు కమర్షియల్ సినిమాల లో నటించడమే కాదు ఎన్నో విభిన్నమైన సినిమాల్లో కూడా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ముఖ్యం గా సుకుమార్ దర్శకత్వం లో తెరకెక్కిన రంగస్థలం సినిమా లో చెవుడు ఉన్న చిట్టిబాబు పాత్ర లో రామ్ చరణ్ చేసిన నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక ఇటీవల త్రిబుల్ ఆర్ లో సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ పండించిన ఎమోషన్స్.. హావా భావాలు చూసి అటు ప్రేక్షకులందరూ కూడా ఫిదా అయి పోయారు అని చెప్పాలి. ఇలా ఎలాంటి పాత్ర ఇచ్చిన రామ్ చరణ్ న్యాయం చేయగలడు. కానీ రామ్ చరణ్ డ్రీమ్ రోల్ ఏంటి అంటే మాత్రం ఎవరికీ తెలియదు.

 అయితే ఒక ఇంటర్వ్యూలో రామ్ చరణ్ తన డ్రీమ్ రోల్ ఏంటి అన్న విషయాన్ని చెప్పకొచ్చాడు. తన జీవితంలో కొన్ని సినిమాలు తనకు వెరీ స్పెషల్ అని చెబుతూనే   పౌరాణిక పాత్రలు చేయడం అంటే తనకు ఎంతో ఇష్టమంటూ చరణ్ చెప్పుకొచ్చాడు. ఇప్పటికే మగధీర సినిమాలో జానపద హీరోగా కనిపించాడు. కానీ అది కల్పిత పాత్ర. కానీ పురాణాల్లో ఉన్న నిజమైన పౌరాణిక పాత్రలు చేయాలని తనకు ఇష్టం అంటూ చెప్పకొచ్చాడు. అదే తన డ్రీమ్ రోల్ అని చరణ్ కామెంట్స్ చేశాడు. మరి భవిష్యత్తులో చరణ్ కు ఇలాంటి పాత్ర ఏదైనా చేసే ఛాన్స్ ఉందో లేదో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: