బాలయ్య NBK 109 నుంచి బిగ్ అప్డేట్..!

Divya
నటసింహ నందమూరి బాలకృష్ణ ఇదే ఏడాది వీరసింహారెడ్డి సినిమాతో ప్రేక్షకులను విపరీతంగా అలరించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా మాస్ హీరోలు మరొకసారి ఈ సినిమాతో మంచి అనుభూతిని పొందారు. ఇక తర్వాత ఆయన నటిస్తున్న మరొక చిత్రం భగవంత్ కేసరి.. ఈ సినిమాను అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిస్తూ ఉండగా.. ఈ సినిమా కూడా మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమా అక్టోబర్ 19వ తేదీన విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉండగా అప్పుడే ఈయనకి సంబంధించిన తదుపరి చిత్రంపై కూడా పలు వార్తలు వైరల్ అవుతున్నాయి.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న భగవంత్ కేసరి సినిమా తర్వాత బాబీ దర్శకత్వంలో బాలయ్య NBK 109 అనే చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు.  ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్,  ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై నిర్మాత సూర్యదేవరనాగ వంశీ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇదివరకే సినిమా నుంచి "ప్రపంచానికి ఇతను తెలుసు.. కానీ ఇతని ప్రపంచం ఎవరికీ తెలియదు" అనే ఒక కొటేషన్ తో ఒక పోస్టర్ ను కూడా ఇటీవల విడుదల చేశారు. 1980లో జరిగిన ఒక స్టోరీ ద్వారా ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తోంది.
ఇకపోతే తాజాగా మ్యాడ్ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న నిర్మాత సూర్యదేవరనాగ వంశీ మాట్లాడుతూ.. ఎన్బికె 109 మూవీ గురించి హింట్ ఇచ్చారు. నిర్మాత మాట్లాడుతూ జై లవకుశ సినిమా తర్వాత డైరెక్టర్ బాబీని నేనే వెళ్లి బాలకృష్ణ తో ఒక సినిమా చేసి పెట్టమని అడిగాను. అయితే ఆ తర్వాత అతను వేరే సినిమాలతో బిజీ అవడం వల్ల అది కుదరలేదు. ఇక బాలకృష్ణతో సినిమా తీసే అవకాశం వస్తే ఖచ్చితంగా మీ నిర్మాణంలోనే తీస్తానని ఆయన మాట ఇచ్చాడు.
మీరు ఊహించని రేంజ్ లో సినిమా ఉంటుంది. సెకండాఫ్ లో  ఒక 40 నిమిషాలు అయితే వేరే లెవెల్. ఇప్పుడు సినిమా షూటింగ్ మొదలవ్వాలి కానీ ఏపీలో రాజకీయాల వల్ల బాలకృష్ణ బిజీగా ఉన్నారు . త్వరలోనే సినిమా మొదలవుతుంది అంటూ అభిమానులలో ఇప్పటినుంచే అంచనాలు పెంచేశారు నిర్మాత.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: