ఆ ముగ్గురు తమిళ స్టార్ హీరోల మూవీస్ షూటింగ్స్ స్టార్ట్ అయ్యేది అప్పుడే..?

Pulgam Srinivas
తమిళ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోలు అయినటువంటి సూపర్ స్టార్ రజనీ కాంత్ , తలపతి విజయ్ , అజిత్ ల గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వీరి ముగ్గురు కూడా ఇప్పటికే ఎన్నో అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ సినిమాలలో హీరోలుగా నటించి ఇండియా వ్యాప్తంగా గొప్ప గుర్తింపును సంపాదించుకున్నారు. ఇకపోతే విరు మరికొన్ని రోజుల్లోనే తమ కొత్త సినిమాలను ప్రారంభించబోతున్నారు. ఆ సినిమాలు ఏవి ..? వాటి షూటింగ్ లు ఎక్కడి నుండి ప్రారంభం కాబోతున్నాయి అనే విషయాలను తెలుసుకుందాం.

సూపర్ స్టార్ రజనీ కాంత్ తాజాగా విడుదల అయినటువంటి జైలర్ మూవీ తో సూపర్ సక్సెస్ ను అందుకున్నాడు. ఈ మూవీ ఇప్పటికే తమిళ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇకపోతే రజిని తన తదుపరి మూవీ ని డీజే జ్ఞానవేలు దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఈ మూవీ షూటింగ్ ఈ వారం ప్రారంభం కాబోతోంది.

తలపతి విజయ్ ఇప్పటికే ఈ సంవత్సరం వారిసు మూవీ తో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక తాజాగా లియో అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ ని ఆగస్టు అక్టోబర్ 19 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇకపోతే విజయ్ తన తదుపరి మూవీ ని వెంకట్ ప్రభు దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఈ వారం నుండే ప్రారంభం కాబోతుంది.

తమిళ సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయినటువంటి అజిత్ కొంత కాలం క్రితమే తూనీవు అనే సినిమాలో హీరోగా నటించాడు. ఇక అజిత్ మరికొన్ని రోజుల్లోనే విడ ముయారచి అనే సినిమాలో హీరోగా నటించబోతున్నాడు. ఈ మూవీ షూటింగ్ కూడా ఈ వారంలోనే ప్రారంభం కాబోతుంది. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా కనిపించనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: