పిల్లల దగ్గర నా ఎఫైర్స్ గురించి కూడా చెప్పేశా..రవీనా టండన్..!!

Anilkumar
సాధారణంగా ఏ సినీ ఇండస్ట్రీలో అయినా లవ్ , బ్రేకప్స్, పెళ్లి ఆ తర్వాత విడాకులు సర్వసాధారణంగా మారిపోయాయి. ఏ  ఇండస్ట్రీలో చూసుకున్నా ప్రస్తుతం ఇవే కనిపిస్తున్నాయి. ఇప్పటికే చాలామంది సినీ సెలబ్రిటీలు వీటన్నిటిని ఎదుర్కొన్న వారే. అయితే చాలామంది ఇలాంటి విషయాలను బయట పెట్టడానికి ఇష్టపడరు. కానీ కొందరు మాత్రం నిర్మొహమాటంగా వారి వ్యక్తిగత విషయాలను బయటపెట్టేస్తారు.
 అయితే ఓ హీరోయిన్ మాత్రం తన ఎఫైర్స్ ని ఏకంగా తన పిల్లలతోనే షేర్ చేసుకుంటానని చెప్పి షాక్ ఇచ్చింది. ఆ హీరోయిన్ మరెవరో కాదు రవీనా టాండన్. 1990 ల కాలంలో కథానాయికగా వెలుగొంది రవీనా. అప్పట్లో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ను ప్రేమించింది. 

'మొహ్రా' అనే సినిమాలో కలిసి నటించిన వీరిద్దరూ ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు. ఆన్ స్క్రీన్ పై తమ జోడితో ఆకట్టుకున్న వీళ్లు రియల్ లైఫ్ లోనూ పెళ్లిపీటలు ఎక్కనున్నట్లు ప్రకటించారు. నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. అంతలోనే బ్రేకప్ చెప్పుకొని ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ వేరే వాళ్ళని చూసుకొని మళ్లీ డేటింగ్ చేశారు. అలా కొన్నాళ్ల తర్వాత రిలేషన్ షిప్స్ కి ఫుల్ స్టాప్ పెడుతూ 2004లో బిజినెస్ మాన్ అనిల్ తడానీని పెళ్లి చేసుకుంది రవీనా. ఈ జంట కి రాష, రణ్ బీర్ వర్ధన్ సంతానం. కానీ పెళ్లికి ముందే 1995లో పూజా, ఛాయ అనే ఇద్దరు చిన్నారులను దత్తత తీసుకొని వాళ్ళకి కూడా అమ్మయింది రవీనా. ఇదిలా ఉంటే పిల్లల దగ్గర తన వ్యక్తిగత విషయాలను ఏదీ దాచనని చెప్పింది.

 ఆఖరికి గతంలో ఉన్న తన ప్రేమ కథలతో సహా దాచకుండా పిల్లలతో పంచుకుంటానని చెప్పి సంచలన వ్యాఖ్యలు చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రవీనా టండన్  మాట్లాడుతూ.." నా ఎఫెక్ట్స్ గురించి పేపర్లో కథలుగా రాస్తారు. అలాంటప్పుడు నేను తప్పించుకోలేను. అది చూసి నా పిల్లలు కంగారు పడొద్దు. అందుకే పత్రికల వాళ్ళ కంటే ముందే నేనే వాళ్లకు అన్ని నిజాలు చెప్పేస్తూ ఉంటాను. ఒకవేళ నేను చెప్పకుండా దాస్తే ఆ విషయం ఈరోజు కాకపోయినా రేపో మాపో ఎలాగైనా తెలిసిపోతుంది. అప్పుడు పరిస్థితులు దారుణంగా మారుతాయి. అప్పట్లో పరిస్థితులు చాలా దారుణంగా ఉండేవి. నా గురించి చాలా చెత్తగా రాశారు. బాడీ షేవింగ్ చేశారు, ఇష్టం వచ్చిన పేర్లు పెట్టేవారు అంటూ చెప్పుకొచ్చింది .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: