ఇన్ స్టా గ్రామ్ లో ఒక్క పోస్ట్ కి అన్ని కోట్లు తీసుకునే బాలీవుడ్ సెలెబ్రిటీ..!?

Anilkumar
సినీ ఇండస్ట్రీ లో స్టార్స్ గా కొనసాగుతున్న సెలబ్రిటీలకి సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే సోషల్ మీడియా ద్వారా కూడా మన సినీ సెలబ్రిటీలు భారీ మొత్తంలోనే కూడబెడుతున్నారు.  ఈ విషయంలో బాలీవుడ్ సినీ సెలబ్రిటీలు ముందు వరసలో ఉంటారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.
 టాలీవుడ్ తో పోల్చుకుంటే చాలామంది బాలీవుడ్ స్టార్స్ సినిమాలు యాడ్స్ కాకుండా సోషల్ మీడియా ద్వారా కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ని ఉపయోగించుకొని అభిమానులతో టచ్ లో ఉండడం, సినిమా అప్డేట్స్ ని అందించడంతోపాటు బ్రాండ్ ఎండార్స్మెంట్స్ కోసం ఇన్ స్టాగ్రామ్ ని ఉపయోగిస్తున్నారు.

 అలా ఓ బాలీవుడ్ సెలెబ్రిటీ ఇన్ స్టాగ్రామ్ లో ఒక్కో పోస్ట్ కి ఏకంగా మూడు కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకొని బాలీవుడ్ లోనే సరికొత్త రికార్డుని క్రియేట్ చేసింది. బాలీవుడ్ లో తన అందం, అభినయంతో అభిమానులను ఆకట్టుకోవడంతో పాటు ఇటీవల హాలీవుడ్ లోనూ తన నటనతో అదరగొట్టింది. ఆమె మరెవరో కాదు ప్రియాంక చోప్రా. కొన్ని నివేదికల ప్రకారం ఇన్ స్టాగ్రామ్ లో 89.4 మిలియన్ ఫాలోవర్స్ ని కలిగి ఉన్న ప్రియాంక చోప్రా ఇన్ స్టా గ్రామ్ ల్ ఒక్కో పోస్ట్ కి మూడు కోట్లు సంపాదిస్తుందట. ఈమె తర్వాత షారుక్ ఖాన్ రూ.80 లక్షల నుండి కోటి రూపాయల వరకు సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. 

అలాగే ఆలియా భట్ కోటి రూపాయలు, శ్రద్ధా కపూర్ రూ.1.18 కోట్లు, దీపికా పదుకొనే రూ.1.5 కోట్లు చార్జ్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే షారుఖ్, దీపిక లాంటి పాపులర్ స్టార్స్ ను మించి ప్రియాంక చోప్రా ఇన్ స్టాగ్రామ్ లో భారీ రెమ్యునరేషన్ అందుకోవడం విశేషం. ఇక ఇటీవల ప్రియాంక చోప్రా అమెరికన్ వెబ్ సిరీస్ సిటాడెల్'(Citadel) లో తన యాక్షన్ ప్యాకెడ్ పెర్ఫార్మెన్స్ తో ఫాన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తర్వాత మరో అమెరికన్ మూవీ 'లవ్ ఎగైన్'(Love Again) లో సామ్ హ్యూగమ్ తో జోడి కట్టి ప్రేక్షకులను మెప్పించింది. ఇక ప్రస్తుతం 'హెడ్స్ ఆఫ్ స్టేట్'(Heads oF State) మూవీ షూటింగ్ తో బిజీగా ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: