విజయ్ దేవరకొండ లిస్టులో మరో క్రేజీ మూవీ..?

Pulgam Srinivas
ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ ఉన్న సినిమాలలో నటిస్తూ ఫుల్ జోష్ లో కెరీర్ ను ముందుకు సాగిస్తున్న యువ నటులలో విజయ్ దేవరకొండ ఒకరు. ఇకపోతే ఈయన తాజాగా శివ నర్వానా దర్శకత్వంలో రూపొందిన ఖుషి అనే సినిమాలో హీరోగా నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలం అయింది. ఇకపోతే విజయ్ చాలా రోజుల క్రితమే గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందబోయే ఓ సినిమాలో హీరోగా నటించబోతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. ఈ మూవీ విజయ్ కెరీయర్ లో 12 వ మూవీ గా రూపొందబోతుంది.

ఇకపోతే ఈ సినిమా బృందం వారు ఈ మూవీ లో విజయ్ సరసన రష్మిక మందన ను హీరోయిన్ గ ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే ప్రస్తుతం విజయ్ పరుశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా విజయ్ కెరీయర్ లో 13 వ మూవీ గా రూపొందుతుంది. ఈ సినిమాకు ఫ్యామిలీ స్టార్ అనే టైటిల్ ను పెట్టే ఉద్దేశంలో మూవీ బృందం వారు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తూ ఉండగా ... మృణాల్ ఠాగూర్ మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఇలా ఇప్పటికే రెండు మూవీ లను లైన్ లో పెట్టుకున్న విజయ్ తన తదుపరి మూవీ ని రవి కిరణ్ దర్శకత్వంలో చేయబోతున్నాడు.

ఈ దర్శకుడు ఇది వరకు రాజా వారు రాణి గారు అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇకపోతే తాజాగా విజయ్ మరో మూవీ ని కూడా ఓకే చేసుకున్నట్లు తెలుస్తోంది. విజయ్ , రవి కిరణ్ దర్శకత్వంలో రూపొందబోయే సినిమా తర్వాత రాహుల్ సంకీర్తన్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో హీరోగా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఇది వరకే వీరి కాంబినేషన్లో టాక్సీవాలా అనే మూవీ రూపొంది మంచి విజయం సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: