"ఓ బేబీ" మూవీ హిందీ వర్షన్ కు సూపర్ రెస్పాన్స్..!

Pulgam Srinivas
సమంత ప్రధాన పాత్రలో నందిని రెడ్డి దర్శకత్వంలో ఓ బేబీ అనే ఓ తెలుగు సినిమా కొంతకాలం క్రితం రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాలో తేజ సజ్జా , రాజేంద్ర ప్రదేశ్ , రావు రమేష్ కీలక పాత్రలలో నటించారు. ఈ మూవీ మంచి అంచనాల నడుమ విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా మంచి కలెక్షన్ లను కూడా రాబట్టింది. ఇకపోతే ఈ సినిమాలో సమంత తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అదిరిపోయే రేంజ్ లో అలరించింది. అలాగే ఈ సినిమాల్లో కీలక పాత్రలో నటించిన తేజ సజ్జా , రాజేంద్ర ప్రసాద్ , రావు రమేష్ కూడా తమ తమ నటనలతో ఈ సినిమా విజయంలో కీలక పాత్రను పోషించారు.

ఇకపోతే ఈ సినిమా ఇప్పటికే తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించి మంచి విజయాన్ని అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ సినిమా విడుదల అయిన చాలా రోజుల తర్వాత ఈ మూవీ ని తాజాగా యూట్యూబ్ లో ఓ బేబీ అనే పేరుతో హిందీ లో స్ట్రీమింగ్ లోకి అందుబాటు లోకి తీసుకు వచ్చారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి హిందీ ప్రేక్షకుల నుండి సూపర్ సాలిడ్ రెస్పాన్స్ లభిస్తుంది. ఈ మూవీ ని యూట్యూబ్ లో హిందీ వర్షన్ ను పోస్ట్ చేసిన కేవలం రెండు వారాల్లోనే 22 మిలియన్ వ్యూస్ ను తెచ్చుకుంది. దీనిని బట్టి చూస్తే ఈ మూవీ హిందీ వర్షన్ కి ప్రేక్షకుల నుండి అదిరిపోయే సాలిడ్ రెస్పాన్స్ లభిస్తుంది అని చెప్పవచ్చు.

ఇకపోతే ఓ బేబీ సినిమాకు దర్శకత్వం వహించిన నందిని రెడ్డి మరికొన్ని రోజుల్లో సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొందబోయే సినిమాకు దర్శకత్వం వహించబోతుంది. ఈ మూవీ లో కూడా సమంత హీరోయిన్ గా నటించబోతున్నట్లు మొదట వార్తలు వచ్చాయి. కానీ ఈ మూవీ మేకర్స్ ప్రస్తుతం ఈ సినిమాలో వేరే నటిని హీరోయిన్ గా తీసుకోవాలి అని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: