రామ్ చరణ్ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు..!?

Anilkumar
అర్ అర్ అర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు కాంబినేషన్లో ఒక  సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ సైతం స్టార్ట్ చేయబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. రూరల్ అండ్ స్పోర్ట్స్ బ్యాక్ గ్రౌండ్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ  ఇప్పటికే అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమాను భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అదేంటంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్గా స్టార్ హీరోయిన్ కూతురుని తీసుకుపోతున్నారు అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇక ఆ స్టార్ హీరోయిన్ మరెవరో కాదు బాలీవుడ్ బ్యూటీ రవీణ టాండన్. ఈమెకి తెలుగులో సైతం భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు ఈమె కూతురు రాషా తడాని సినీ ఇండస్ట్రీకి పరిచయం కాబోతోంది. ఇప్పటికే ఒక హిందీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్

ఇచ్చిన ఈ అందాల తార తెలుగులో రామ్ చరణ్ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వబోతోంది. దానితోపాటు ఆర్ సి 16కి సంబంధించి ఈ ముద్దుగుమ్మ లుక్ నీ సైతం మేకర్స్ టెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇందుకోసం ఈమధ్య హైదరాబాద్ సైతం వచ్చి వెళ్ళింది ఈ చిన్నది. లుక్ టెస్ట్ సైతం మేకర్స్ కు బాగా నచ్చింది అని త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మేకర్స్ వెల్లడించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: