సలార్ సినిమా వచ్చేది ఆరోజే.. ట్వీట్ వైరల్..!!

Divya
ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న చిత్రాలలో సలార్ సినిమా కూడా ఒకటి. ఈ సినిమాని డైరెక్టర్ ప్రశాంతినిల్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. హీరోయిన్గా శృతిహాసన్ నటించిన మలయాళ నటుడు పృధ్విరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఇందులో కీలకమైన పాత్రలో జగపతిబాబు, శ్రియా రెడ్డి కూడా నటిస్తూ ఉన్నారు. వాస్తవానికి ఈ సినిమా ఈనెల 28వ తేదీన విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల చేత ఈ సినిమా పోస్ట్ పోన్ కావడం జరిగింది.

సలార్ సినిమా పోస్ట్ పోన్ కావడంతో ఈ సినిమా రిలీజ్ డేట్ పైన పలు రకాల వార్తలు వినిపించాయి.. దీంతో ఈ రూమర్లకు చెక్ పెట్టే విధంగా చిత్ర బృందం  ఈ రోజున ఈ సినిమా రిలీజ్ డేట్ పైన క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఈ ఏడాది డిసెంబర్ 22 నుంచి డైనోసార్ వేట మొదలవుతుందని వచ్చే నెల ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలను మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. నవంబర్ నెలలో ఈ సినిమా ట్రైలర్ విడుదల చేసే విధంగా చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం ఇప్పటికే విడుదలైన సలార్ టీజర్ మంచి పాపులారిటీ అందుకున్నది.

యాక్షన్ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ యాక్షన్ తో అదరగొట్టబోతున్నట్లు తెలుస్తోంది. రిలీజ్ డేట్ పై వస్తున్న వార్తలలో ప్రభాస్ అభిమానులు నిరుత్సాహపడగా తాజాగా చిత్ర బృందం ఇలా అఫీషియల్ గా ఒక పోస్టర్ తో రిలీజ్ డేట్ ను తెలియజేయడంతో ప్రభాస్ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. హోం భలే ఫిలిమ్స్ బ్యానర్ గారు రిలీజ్ డేట్ పై ట్విట్ చేయడం జరిగింది. ప్రస్తుతం అందుకు సంబంధించి ఈ ట్వీట్ వైరల్ గా మారుతోంది. భారీ అంచనాల మధ్య భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఏ మేరకు అభిమానులను మెప్పిస్తుందో  చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: