సూపర్ స్టార్ రజినీకాంత్ ఇటీవల జైలర్ సినిమాతో భారీ విజయన్ని తన సొంతం చేసుకున్నాడు. దాదాపు పుష్కరకాలం తర్వాత తలైవా కొట్టిన దెబ్బకు బాక్స్ ఆఫీస్ షేక్ అయింది. ఏకంగా 600 కోట్లకు పైగా నే కలెక్ట్ చేసింది జైలర్. రోబో సినిమా తర్వాత ఆ స్థాయి హిట్ అందుకున్నాడు రజనీకాంత్ . ఇక ఈ సినిమాకి థియేటర్ల ముందు హౌస్ ఫుల్ బోర్డులు చూసి చాలా ఏళ్ళే అవుతుంది. ఆ కోరిక ఈ సినిమాతో నెరవేరింది. కోలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ లో సైతం రజినీకాంత్ కు సమానమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కొన్నాళ్లుగా సరైన విజయం లేక రజనీకాంత్ క్రేజ్ పడిపోతుంది అని
అనుకున్న సమయంలో జైనర్ సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు తలైవా. జైలర్ సినిమాకు నెల్సన్ కుమార్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా సక్సెస్ మీట్ లో నెల్సన్ దానికి సీక్వెల్ సైతం ఉంది అని ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతే కాదు దానికి సంబంధించిన స్క్రిప్ట్ కూడా రెడీ చేసే పనిలో ఉన్నాడు. తాజాగా జైలర్ టు సినిమాకి సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. జైలర్ టు సినిమా కోసం నెల్సన్ కు నిర్మాత కళానిధి అడ్వాన్స్ రూపంలో కళ్ళు చెదిరే చెక్ ఇచ్చాడు అన్న వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అక్షరాలా 55 కోట్లు ఇచ్చారు అని అంటున్నారు. ఒక దర్శకుడికి ఇంత పెద్ద మొత్తంలో అడ్వాన్స్ ఇవ్వడం అన్నది అంత తేలికైన విషయం కాదు. అడ్వాన్స్ ఇంత ఇస్తే అసలు ఇంకెంత ఉంటుంది అని ఆలోచిస్తున్నారు అభిమానులు. దీంతో ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. రజనీకాంత్ హీరోగా వచ్చిన జైలర్ సినిమాలో తమన్నా రమ్యకృష్ణ మోహన్ లాల్ శివరాజ్ కుమార్ జాకీశ్రాఫ్ కీలక పాత్రలో కనిపించారు. ఇక ఈ సినిమా కంటే ముందే మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు నెల్సన్. ఇందులో భాగంగానే అల్లు అర్జున్ ను సైతం కలిసి కథను వినిపించినట్లుగా తెలుస్తోంది. కానీ ఫైనల్ నరేషన్ నచ్చకపోవడంతో అల్లు అర్జున్ ఈ సినిమాని రిజెక్ట్ చేశారట..!!