ఆర్ఎక్స్ 100, మహాసముద్రం వంటి సినిమాలు తర్వాత అజయ్ భూపతి దర్శకత్వం వహించిన మూవీ మంగళవారం. ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి రెడ్డి గునుపాటి సురేష్ వర్మ ఈ సినిమాను నిర్మించారు. ఇక ఇందులో పాయల్ రాజ్ ప్రధాన పాత్రలో నటించింది. ఈ సినిమా నవంబర్ 17న తెలుగులోనే కాకుండా తమిళ కన్నడ మలయాళం హిందీ వంటి భాషల్లో విడుదల చేయబోతున్నట్లుగా దర్శక నిర్మాతలు ప్రకటించారు అజయ్ భూపతి. ఈ నేపథ్యంలోనే మాట్లాడుతూ గ్రామీణ నేపథ్యంలో వస్తున్న రస్టిక్ యాక్షన్ ఈ సినిమా అని చెప్పకు వచ్చాడు.
సినిమాలో ఉన్న ప్రతి క్యారెక్టర్ చాలా అద్భుతంగా ఉంటుంది అనీ.. ఎవరు మంచి ఎవరు ఇచ్చాడు అన్నది కనిపెట్టడం చాలా కష్టం అని.. అలా ఈ సినిమా ముందుకు వెళుతుంది అని పేర్కొన్నారు. క్యారెక్టర్స్ మీద బేస్ చేసుకుని తీసిన సినిమా ఇది అని.. క్యారెక్టర్ చూస్తే ఖచ్చితంగా మీరందరూ షాక్ అవుతారు అని.. ఆయన పేర్కొన్నారు. అనంతరం నిర్మాతలు మాట్లాడుతూ.. అజయ్ భూపతి ఆర్ఎక్స్ 100 సినిమా లో తెలుగులో కొత్త ట్రెండు ని సెట్ చేశారు. ఇప్పుడు మంగళవారం సినిమాతో కూడా సరికొత్త ఫ్రెండ్ ని సెట్ చేస్తారు. ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్..
ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్ పై ఎవరు ఇటువంటి సినిమాని ట్రై చేయలేదు అన్న విధంగా మేము ఈ సినిమాని తీసామూ .. నవంబర్ 17న థియేటర్స్ లో సినిమాని చూసి ప్రేక్షకుల సైతం ఇదే మాట చెబుతారు అని వెయిట్ చేస్తున్నాం.. 99 రోజులు ఈ సినిమా షూటింగ్ చేశాను. అందులో 51 రోజులు రాత్రి వేళలో ఈ సినిమాని షూట్ చేశాం.. మేము ఉన్నత సాంకేతిక విలువలతో ఈ సినిమాను నిర్మించేమూ .. అంటూ ఆయన పేర్కొన్నాడు. కాంతారా సినిమాతో పాపులర్ అయిన అజినీష్ లోకనాథ్ ఎక్స్ట్రార్డినరీ మ్యూజిక్ అందించారు.. సలార్ తదితర సినిమాలకు పని చేసిన రంగస్థలం సినిమాతో నేషనల్ అవార్డు అందుకున్న రాధాకృష్ణ ఈ సినిమాకి సౌండ్ డిసైనర్ గా పనిచేశారు అంటూ ఆయన వెల్లడించారు..!!