ప్రభాస్,శ్రీ లీల కాంబో లో కొత్త సినిమా.. డైరెక్టర్ ఎవరంటే..!?

Anilkumar
ఇండస్ట్రీ లో ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఎవరు అనగానే టక్కున గుర్తుకు వచ్చే పేరు శ్రీ లీల. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ అలరిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఈ క్రమంలోనే ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అయితే ఒక భారీ ప్రాజెక్టు లో శ్రీ లీలా భాగం కాబోతుంది అన్న సమాచారం వినబడుతోంది. సీతారామం సినిమాతో అందరి మనసులను గెలుచుకున్న డైరెక్టర్ హను రాఘవపూడి పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ తో కలిసి ఒక సినిమా చేస్తున్నాడు అని గతకొంత కాలంగా

 సోషల్ మీడియాలో వార్తలు తెగ వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీలను ఫిక్స్ చేశారు అన్న సమాచారం సైతం వినబడుతోంది. ఇప్పటికే ఈ స్టోరీని ప్రభాస్ శ్రీ లీల కి వినిపించగా వీళ్ళిద్దరూ కూడా ఈ ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రేమ కథ చిత్రం గా రానున్న ఈ సినిమాలో మొదటిగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ను తీసుకోవాలని మేకర్స్ ప్లాన్ చేశారు అని కూడా గతంలో వార్తలు వచ్చాయి. అయితే తాజాగా శ్రీ లీల పేరు ఇప్పుడు తెర పైకి రావడంతో శ్రీ లీల ఈ సినిమాలో హీరోయిన్గా ఫిక్స్ అయింది అని అంటున్నారు.

 ఇక ఈ సినిమా షూటింగ్ డిసెంబర్లో మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. అక్టోబర్ 23 న ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన సైతం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం సలార్, కల్కి, స్పీరిట్ వంటి సినిమాలతో పాటు మారుతి దర్శకత్వంలో సైతం ఒక సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలకు సంబంధించిన విడుదల తేదీలపై ఇంకా క్లారిటీ రాలేదు. ఇటు శ్రీ లీల సినిమాల విషయానికి వస్తే ఈమె నటించిన స్కంద సినిమా సెప్టెంబర్ 28న విడుదల కాబోతోంది. దానితోపాటు బాలకృష్ణ తో కలిసి నటించిన భగవంత్ కేసరి సినిమా సైతం అక్టోబర్ 19న విడుదల కాబోతోంది. ఈ రెండు సినిమాలతో పాటు మరొ ఆరు సినిమాల్లో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: