రక్త హీనతని తగ్గించే సూపర్ టిప్?

Purushottham Vinay
ఐరన్ లోపించడం వల్ల శరీరంలో ఎర్ర రక్తకణాలు చాలా తక్కువగా తయారవుతాయి. అందువల్ల హిమోగ్లోబిన్ తగ్గి రక్తహీనత సమస్య తలెత్తుతుంది. శరీరంలో ఐరన్ లోపించడం వల్ల అలసట, నెలసరి సక్రమంగా రాకపోవడం, శరీరం పాలిపోయినట్టు ఉండడం, తలతిరగడం ఇంకా శ్వాస తీసుకోవడంలో ఆటంకం కలగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.ఈ లక్షణాలను మీరు నిర్లక్ష్యం చేసే కొద్ది మరింత తీవ్రమయ్యి తీవ్ర అనారోగ్యానికి గురి కావాల్సి వస్తుంది.కాబట్టి ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ఈ ఐరన్ లోపాన్ని మనం చాలా వరకు కూడా సప్లిమెంట్స్ తో తగ్గించుకోవచ్చు. ఇంకా అలాగే ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల కూడా ఈ సమస్య నుండి చాలా ఈజీగా బయటపడవచ్చు. ఐరన్ లోపంతో బాధపడే వారు ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది. ఇక ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారాల్లో అలసందలు కూడా ఒకటి. అలసందలల్లో ఐరన్ తో పాటు చాలా పోషకాలు ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల ఖచ్చితంగా 26 నుండి 29 శాతం ఐరన్ మన శరీరానికి లభిస్తుంది.



వీటిని క్రమం తప్పకుండా ప్రతి రోజూ ఆహారంలో తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇంకా అలాగే కాలేయం, మెదడు, గుండె వంటి వాటిని తీసుకోవడం వల్ల కూడా ఐరన్ లోపం చాలా వరకు ఈజీగా తగ్గుతుంది.ఇంకా అదే విధంగా ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారాల్లో బెల్లం కూడా ఒకటి. ప్రతి రోజూ ఒక చిన్న బెల్లం ముక్కను తీసుకోవడం వల్ల చాలా వరకు ఐరన్ లోపం తగ్గుతుంది. ఇక ఐరన్ లోపంతో బాధపడే వారు నానబెట్టిన ఎండుద్రాక్షను తీసుకోవడం వల్ల కూడా చక్కటి ఫలితం ఉంటుంది. ప్రతి రోజూ రాత్రి నీటిలో 10 నుండి 15 ఎండు ద్రాక్షలను వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే ఈ ఎండుద్రాక్షలను తిని ఆ నీటిని తాగడం వల్ల మన శరీరానికి కావల్సిన ఐరన్ లభిస్తుంది. ఇక ఐరన్ లోపంతో బాధపడే వారు ఆకుకూరలను తీసుకోవడం వల్ల కూడా చాలా మంచి ఫలితం ఉంటుంది. ప్రతి రోజూ ఒక ఆకుకూరను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సినంత ఆహారం లభిస్తుంది.ఇంకా అలాగే మన ఆరోగ్యానికి కూడా చాలా మేలు కలుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: