ఆ కారణంగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నా రవికృష్ణ...!!
దాంతో హీరోగా సినిమాలు తగ్గాయి.. కెరియర్ ఆల్మోస్ట్ ముగిసిపోయింది. రవి కృష్ణ చివరగా నటించిన సినిమా తమిళ్ లో 2011లో విడుదల కాగా దాదాపు పుష్కర కాలం పాటు మళ్ళీ మొహానికి మేకప్ వేసుకోలేదు. అయితే ప్రస్తుతం 7 జి బృందావన్ కాలనీ సినిమాకు సీక్వెల్ రూపొందితుండడంతో అందరూ మరోసారి ఆసక్తిగా ఇలాంటి సినిమా రాబోతుందో అని ఎదురు చూస్తున్నారు.అయితే చాలామంది ఇన్నేళ్ల పాటు రవి ఎందుకు సినిమాలు తీయడం లేదు అంటూ అనేకసార్లు సోషల్ మీడియాలో స్పందిస్తూనే ఉన్నారు ఈ విషయంపై రవి కృష్ణ ఇప్పుడు మొదటిసారిగా తన ఆ వివరణ ఇచ్చుకున్నాడు. చాలామంది నేను బృందావన్ కాలనీ వంటి సినిమా తీయడం లేదని ఆ తర్వాత అసలు సినిమాల్లోనే కనిపించలేదని అనుకుంటున్నారు. కానీ ఈ 20ఈ ఏళ్ల కాలంలో దాదాపు 600 నుంచి 700 వరకు కథలు విన్నాను. నా వరకు కథ బాగుంటేనే సినిమా బాగుంటుంది. స్క్రిప్ట్ లెవెల్ లో బాగా లేని సినిమాలు ఎలా ప్రేక్షకులను మెప్పించగలవు అందుకే సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాను. మళ్ళీ ఇప్పుడు మీ అందరి ముందుకు రాబోతున్నాను అంటూ రవికుమార్ తెలియజేశారు.