యశ్ రాజ్ స్పై యూనివర్స్ నుండి మరో సినిమాగా 'టైగర్ Vs పఠాన్'.. మార్చ్ లో షూటింగ్, రిలీజ్ ఎప్పుడంటే..?

Anilkumar
బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలిమ్స్ మరో భారీ మల్టీ స్టారర్ ప్రాజెక్టును తెరికేక్కించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ నిర్మాణ సంస్థలో స్పై యూనివర్స్ గా వచ్చిన అన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఇప్పుడు ఇదే స్పై యూనివర్స్ నుండి సల్మాన్, షారుక్ లతో డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ పవర్ ఫ్యాక్డ్ యాక్షన్ ఎంటర్టైనర్ ని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 'టైగర్ Vs పఠాన్' అనే టైటిల్ తో ఈ సినిమా రూపొందునున్నట్లు సమాచారం. గత కొద్ది రోజుల క్రితం డైరెక్టర్ ఆదిత్య చోప్రా స్పై యూనివర్స్ లో భాగంగా షారుక్, సల్మాన్ ని విడివిడిగా కలిసి స్క్రిప్ట్ నెరేట్ చేసినట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం.
ప్రస్తుతం సల్మాన్ ఖాన్ నటిస్తున్న 'టైగర్ 3' లో షారుక్ 'పఠాన్' గా క్యామియో రోల్ చేస్తున్నారు. సుమారు 15 నిమిషాల పాటు ఉండబోయే ఈ ఎపిసోడ్ లోనే తర్వాత షారుక్ Vs సల్మాన్ మూవీ ప్లాట్ ని ఎస్టాబ్లిష్ చేస్తారట. ఇప్పటికే ఈ ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ పార్ట్ అంతా కంప్లీట్ అయినట్లు సమాచారం. షారుక్, సల్మాన్ ఖాన్ మధ్య బ్రిడ్జిపై ఓ భారీ బైక్ చేజ్ ఎపిసోడ్ ఫైట్స్ సీన్ షూట్ చేశారు. 'టైగర్3' నుంచే టైగర్ Vs 'పఠాన్' కథ మొదలవుతుంది. ఇప్పటికే స్క్రిప్ట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. ఈ నవంబర్ నుండి ప్రాజెక్టుకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అవ్వనుంది. వచ్చే ఏడాది మార్చిలో షూటింగ్ మొదలుపెట్టి 2024 దీపావళి సీజన్ కి కానీ 2025 జనవరి 25న కానీ రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
బాలీవుడ్ ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ యాక్షన్ ఫ్యాక్డ్ ఎంటర్టైనర్ గా టైగర్ Vs పఠాన్ రానుంది. యశ్ రాజ్ స్పై యూనివర్స్ లో ఇది 6వ ప్రాజెక్టు కావడం విశేషం. 2012లో సల్మాన్ ఖాన్ 'ఏక్తా టైగర్' నుంచి ఈ స్పై యూనివర్స స్టార్ట్ అవ్వగా, ఆ తర్వాత అలీ అబ్బాస్ జఫర్ దర్శకత్వంలో వచ్చిన 'టైగర్ జిందా హై', సిద్ధార్థ్ ఆనంద్ 'వార్', 'పఠాన్', మనీష్ శర్మ దర్శకత్వంలో సల్మాన్ హీరోగా త్వరలోనే 'టైగర్ 3' రాబోతోంది. 'టైగర్ 3' లో సల్మాన్ సరసన కత్రినా కైఫ్ ఫిమేల్ లీడ్ గా నటిస్తుండగా, బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ మెయిన్ విలన్ గా కనిపించనున్నారు. దీపావళి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. హిందీ తో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: