వాటిపై వస్తున్నా ఆరోపణలని ఖండించిన నటుడు...!!

murali krishna
టాలీవుడ్ యంగ్ హీరో నవదీప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు గతంలో హీరోగా ‘చందమామ’ ‘గౌతమ్ ఎస్ ఎస్ సి’ ‘మొదటి సినిమా’ వంటి మంచి సినిమా ల్లో అతను నటించాడు. తర్వాత ‘ఆర్య 2 ‘ ‘బాద్ షా’ ‘నేనే రాజు నేనే మంత్రి’ అనే సినిమాల్లో కూడా నటించాడు. బిగ్ బాస్ సీజన్ 1 లో కూడా ఇతను ఓ కంటెస్టెంట్ గా పాల్గొన్న సంగతి తెలిసిందే. తాజా గా నవదీప్ పేరు మాదాపూర్ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నట్టు బాగా ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం అతను పరారీ లో ఉన్నాడని… హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ప్రకటించినట్టు అంతా కూడా చెప్పుకుంటున్నారు.
డ్రగ్స్ వాడే కస్టమర్స్ లిస్ట్ లో నవదీప్ పేరు కూడా ఉందని.. ఇతని తో పాటు ఇంకా చాలా మంది సినీ ప్రముఖులు కూడా డ్రగ్స్ తీసుకున్నారని చర్చలు జరుగుతున్నాయి. ఈ కేసులోనే మాజీ ఎంపీ కుమారుడు దేవరకొండ సురేష్‌ కూడా అరెస్ట్ అయినట్టు సీపీ సీవీ ఆనంద్ తెలిపారు.
ఇంకా ఈ కేసులో నవదీప్ స్నేహితుడు అయిన రాంచంద్‌ ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారట. గతంలో జరిగిన ఈడీ విచారణలో కూడా నవదీప్ హాజరైనట్టు సమాచారం.. అయితే ఈ ప్రచారాన్ని నవదీప్ ఖండించారు. తన సోషల్ మీడియా ద్వారా పరోక్షంగా ఈ విషయంపై స్పందించాడు నవదీప్. ‘నేను ఎక్కడికి పారిపోలేదు, హైదరాబాద్‌లోనే ఉన్నాను.దయచేసి ఈ విషయం పై సరిగ్గా చెక్ చేసుకోండి’ అంటూ ఈ కేసుతో తనకు సంబంధం లేదనీ తెలిపాడు.ఇదిలా ఉంటే ప్రస్తుతం నవదీప్ నిర్మాతగా కూడా మారి ‘సగిలేటి కథ’ అనే సినిమాని తెరకెక్కించాడు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నవదీప్ పలు స్టార్ హీరోల సినిమాల్లో కూడా నటిస్తూ మెప్పిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: