ఇకమీదట మెగా- నందమూరి మధ్య వార్ ఉండదా..?

Divya
దాదాపుగా కొన్ని సంవత్సరాల నుంచి సినీ ఇండస్ట్రీలో మెగా, నందమూరి హీరోల మధ్య గట్టి వార్ కొనసాగుతూ ఉండేది. అంతేకాకుండా ఏదైనా ఎన్నికలు జరిగినా కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కరికి సపోర్టుగా ఇస్తూ ఉండేవారు. దీంతో గత కొంతకాలంగా ఇండస్ట్రీలో నందమూరి మెగా కుటుంబానికి హవా అన్నట్లుగా వార్తలు వినిపిస్తూ ఉండేవి.. ఇక పొలిటికల్ ఎన్నికలలో కూడా నందమూరి కుటుంబ సభ్యులు టిడిపికి సపోర్టు చేస్తూ ఉండగా మెగా కుటుంబం జనసేనకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. గతంలో చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీకి కూడా సపోర్ట్ చేయడం జరిగింది మెగా కుటుంబం.


అయితే ఈ మధ్యకాలంలో జరుగుతున్న పరిణామాలు చూసుకుంటే.. ఇకమీదట మెగా నందమూరి కుటుంబాల మధ్య వార్ అనేది ఉండదని వార్తలు వినిపిస్తున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే గత కొంతకాలంగా మెగా మరియు నందమూరి కుటుంబ సభ్యుల మధ్య మంచి స్నేహబంధం వాతావరణం ఏర్పడింది దాదాపుగా ఎన్టీఆర్ రామ్ చరణ్ కలిసి rrr చిత్రంలో నటించడం జరిగింది. ఇక బాలయ్య ఆహా అన్స్టాపుల్ షోలో హో స్టుగా చేయబడుతున్నారు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి మరి ఒక్కొక్కసారి ఒక్కో ఎత్తున మాట్లాడుతూ ఉంటారు.

గత కొద్ది రోజుల క్రితం స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో చంద్రబాబు నాయుడుని అరెస్టు చేయగా అందుకు మద్దతుగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ చేయడంతో పాటు మొన్నటి రోజున సాయంత్రం వేళ జనసేన పార్టీ టిడిపి తో పొత్తు పెట్టుకొని మరి ఎన్నికలలో నిలవబోతోంది అంటూ తెలియజేశారు. దీన్ని బట్టి చూస్తూ ఉంటే ఇక మీదట ఎక్కడా కూడా నందమూరి మెగా ఫ్యామిలీ మధ్య వార్ వినిపించదు అన్నట్టుగా పలువురు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇలా చేయడం వల్ల కొంతమంది అభిమానులు సైతం చాలా నిరుత్సాహంతో ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: