ఇటీవల విడుదలై సంచలన విజయాన్ని అందుకున్న జవాన్ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ దీపికా పడుకునే అతిధి పాత్రలో కనిపించడం తో ఈ సినిమాకి మరింత ప్లస్ అయింది. ఇక ఈ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుండి దీపికా పదుకొనే రెమ్యూనరేషన్ గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు ప్రచారం అవుతున్నాయి. తాజాగా వాటన్నిటిపై స్పందించి ఫుల్ స్టాప్ పెట్టింది దీపిక. ఒక ఇంటర్వ్యు లో భాగంగా మాట్లాడుతూ.. “ఇటీవల వచ్చిన కొన్ని సినిమాల్లో నేను అతిధి పాత్రలు చేశాను.. తాజాగా వచ్చిన జవాన్ సినిమాతో పాటు రన్వీర్ సింగ్ 83 దానితోపాటు సర్కస్ వంటి సినిమాల్లో నేను నటించాను.
ఆ కథలో నచ్చి వాటిలో నటించిన ఒప్పుకున్నాను. 83 సినిమాలో కనిపించడానికి ఒక ముఖ్య కారణం కూడా ఉంది. మహిళలు ఎన్ని త్యాగాలు చేస్తున్నారో ఆ సినిమాలో కళ్ళకు కట్టినట్లుగా చూపించారు. అందుకే ఆ సినిమాలో నటించాను అంత గొప్ప సినిమాలో నేను నటించాలని ఎప్పటికీ కోరుతూనే ఉంటాను. అలాగే జవాన్ కథ కూడా నాకు చాలా బాగా నచ్చింది. అంతేకాదు షారుక్ తో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. మేమిద్దరం మంచి స్నేహితులం కూడా. అయితే జవాన్ లో ఉన్న రెమ్యూనరేషన్ గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి వార్తలన్నీ అవాస్తవాలు.
నేను ఆ సినిమా కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. అంటూ క్లారిటీ ఇచ్చింది దీపిక. అనంతరం ఆమె ట్రోల్స్ గురించి కూడా మాట్లాడుతూ.. నాపై వచ్చే ట్రోల్స్ గురించి నేను అసలు పట్టించుకోను.. నా పూర్తి ఫోకస్ నేను చేసే పని పైనే పెడతాను.. అన్నివేళ అందరూ అందంగా ఉండాలని రూల్ లేదు.. నన్ను అందంగా తీర్చిదిద్దడం కోసం ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్టులు ఉన్నారు.. నేను నాకు సౌకర్యవంతంగా ఉండే దుస్తులు వేసుకోవడానికి ఇష్టపడతాను.. కొత్త ఫ్యాషన్ ప్రయత్నించడానికి నేనెప్పుడూ రెడీగా ఉండను.. అంతేకాదు నేను నటి అవ్వకముందు ఒక ప్రొఫెషనల్ మోడల్ అని మీరు గుర్తుపెట్టుకోండి.. అంటూ వెల్లడించింది దీపిక. దీంతో దీపిక చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి..!!