చంద్రబాబుకు సపోర్ట్ చేసి.. ప్రభాస్ ను రిస్కులో పడేసిన నిర్మాత?
ఇటీవల ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును పోలీసులు అరెస్టు చేశారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో భాగంగా ఆయనకు కోర్టు 14 రోజుల రిమాండ్ కూడా విధించింది. దీంతో ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలుకు చంద్రబాబును తీసుకువెళ్లారు. అయితే చంద్రబాబు అరెస్టును టిడిపి నేతలు అభిమానులు తీవ్రంగా ఖండిస్తున్నారు. కొంతమంది సినీ ప్రముఖులు కూడా అటు చంద్రబాబుకు సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పాలి. అయితే ఇటీవల నిర్మాత అశ్వినీదత్ చంద్రబాబుకు సపోర్టుగా నిలుస్తూ.. ఒక వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు.
చంద్రబాబు అరెస్టు దారుణం అంటూ పేర్కొన్న అశ్వినీదత్ ఇదొక దురదృష్టకరమైన రోజు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దేశానికి గొప్ప ప్రైమ్ మినిస్టర్ ను, గొప్ప లోక్సభ స్పీకర్ను, గొప్ప రాష్ట్రపతిని ఇచ్చిన ది గ్రేట్ లెజెండ్ చంద్రబాబును ఇంత దుర్మార్గంగా అరెస్టు చేసి లేనిపోని బీభత్సం చేసిన వారిని కచ్చితంగా పుట్టగతులు ఉండవు అంటూ శాపనార్ధాలు కూడా పెట్టారు. ఇక వచ్చే ఎన్నికల్లో టిడిపి కచ్చితంగా 106 గేలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎందుకంటే ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా కల్కి 2898 ఏడి సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ నిర్మిస్తూ ఉన్నారు. ఇప్పుడు అశ్విని దత్ చంద్రబాబుకు మద్దతుగా ఉంటూ వ్యాఖ్యలు చేశారు.. ఇక జగన్ ప్రభుత్వం ప్రభాస్ మూవీ టికెట్ రేట్స్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అని హాట్ టాపిక్ గా మారింది.