మరో పారాణిక పాత్ర లో ప్రభాస్.. ఈసారి ఏకంగా..?

Divya
పాన్ ఇండియా హీరో ప్రభాస్ పారాణిక దేవుడు పాత్రలపైన ఈ మధ్యకాలంలో ఎక్కువగా మక్కువ చూపుతున్నట్లు కనిపిస్తోంది.. ఇన్ని రోజులు లవర్ బాయ్ గా మాస్ హీరోగా పేరు సంపాదించిన ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత సరికొత్త పాత్రలలో ప్రేక్షకులను మెప్పిస్తూ ఉన్నారు. బాహుబలి చిత్రంలో రాజులాగా మెప్పించిన ప్రభాస్ సాహో సినిమాలో హాలీవుడ్ హీరోల పాపులారిటీ. ఆది పురుష్ చిత్రంలో రాముడు లాగా కనిపించారు. ఇప్పుడు మరొకసారి రెండు సినిమాలలో దేవుడు పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


మంచు విష్ణు తెరకెక్కిస్తున్న భక్తకన్నప్ప చిత్రంలో విష్ణు కన్నప్ప క్యారెక్టర్ చేస్తూ ఉండగా ప్రభాస్ శివుడి పాత్రలో చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని మంచు విష్ణు కూడా తెలియజేసినట్టు సమాచారం. ఈ విషయం తెలిసిన అభిమానుల సైతం ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు.. ప్రభాస్ రాబోయే సినిమాలలో కల్కి సినిమా కూడా ఒకటి ఈ చిత్రాన్ని డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తూ ఉండగా అమితాబచ్చన్ కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు. అలాగే విలన్ గా కమలహాసన్ నటిస్తూ ఉండగా దిశా పటాని కూడా నటిస్తోంది.

కల్కి సినిమాలో కూడా విష్ణువు పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కల్కి అవతారంలో కనిపిస్తాడని ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే వీటిని చిత్ర యూనిట్ మాత్రం ఖండించలేదు. దీంతో నిజంగానే కల్కి సినిమాలో ప్రభాస్ విష్ణువు లేదా కల్కి పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఇలా వరుసగా పారాణిక పాత్రలలో నటిస్తూ ఉన్న ప్రభాస్.. గతంలో కూడా యమదొంగ సినిమా నిర్మించిన విశ్వామిత్ర కిరియేషన్ బ్యానర్స్ టైటిల్స్ కోసం విశ్వామిత్ర గెటప్ ను కూడా వేయడం జరిగిందట.. అయితే ఈ బ్యానర్ కూడా రాజమౌళి ఇదే అన్నట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత ప్రభాస్ మిర్చి సినిమాలో ఒక సాంగ్లో కృష్ణుడు గెటప్ లో కనిపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: