3 రోజుల్లో "మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి" మూవీకి వచ్చిన కలెక్షన్స్ ఇవే..!

Pulgam Srinivas
ఈ నెల 7 వ తేదీన మంచి అంచనాల నడుమ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే సినిమా ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాలో ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ , జాతి రత్నాలు మూవీ తో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న నవీన్ పోలిశెట్టి హీరోగా నటించగా ... అనుష్క ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఇకపోతే ఈ మూవీ ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 3 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. మరి ఈ 3 రోజుల్లో ఈ సినిమా వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

మొదటి రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 3 కోట్ల షేర్ , 5.95 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

2 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 2.26 కోట్ల షేర్ , 4.55 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

3 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 3.58 కోట్ల షేర్ , 6.70 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మొత్తంగా ఈ సినిమా 3 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ప్రపంచ వ్యాప్తంగా 8.84 కోట్ల షేర్ , 17.20 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

ఇకపోతే మొత్తంగా ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 12.50 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 13.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఇకపోతే ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా మరో 4.66 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసినట్లయితే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని క్లీన్ హీట్ గా నిలుస్తుంది.

ఇకపోతే ఈ మూవీ కి మహేష్ బాబు పి దర్శకత్వం వహించగా ... యు వి క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ , ప్రమోద్ లు ఈ సినిమాను నిర్మించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: