తెలుగు సినిమా పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటులలో నవీన్ పోలిశెట్టి ఒకరు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ మూవీ తో మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకున్న ఈయన ఆ తర్వాత జాతి రత్నాలు మూవీ తో తన క్రేజ్ ను మరింతగా పెంచుకున్నాడు. ఇకపోతే తాజాగా ఈ యువ నటుడు మహేష్ బాబు పి దర్శకత్వంలో రూపొందినటువంటి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ లో అనుష్క శెట్టి హీరోయిన్ గా నటించింది. ఇకపోతే ఈ సినిమా సెప్టెంబర్ 7 వ తేదీన భారీ అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయింది. ఇప్పటి వరకు ఈ సినిమా 2 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. మరి ఈ రెండు రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.
మొదటి రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 3 కోట్ల షేర్ , 5.95 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
2 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 2.26 కోట్ల షేర్ , 4.55 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
మొత్తంగా ఈ సినిమా రెండు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ప్రపంచ వ్యాప్తంగా 5.26 కోట్ల షేర్ , 10.50 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
ఇకపోతే మొత్తంగా ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 12.50 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 13.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఇకపోతే ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా మరో 8.24 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసినట్లయితే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని క్లీన్ హీట్ గా నిలుస్తుంది.