తారక్ కోసం ప్రశాంత్ నీల్ రెడీ చేసిన స్క్రిప్ట్ చూసి.. ప్రభాస్ షాక్?

praveen
ఒకప్పుడు కన్నడ ఇండస్ట్రీపై అందరికీ చిన్న చూపు ఉండేది అన్న విషయం తెలిసిందే. ఏకంగా అక్కడ లో బడ్జెట్ సినిమాలు ఉంటాయని అందరూ అనుకునేవారు. అక్కడ దర్శకులతో సినిమాలు చేసేందుకు మిగతా ఇండస్ట్రీలలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారు కూడా పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు. కానీ ఎప్పుడైతే కేజిఎఫ్ సినిమా వచ్చి సెన్సేషన్స్ సృష్టించిందో  అప్పటినుంచి అందరూ చూపు కన్నడ ఇండస్ట్రీ వైపు వెళ్లిపోయింది. ఇక బాలీవుడ్ టాలీవుడ్ అనే తేడా లేకుండా అందరూ స్టార్ హీరోలు కన్నడ దర్శకులతో సినిమాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు అని చెప్పాలి.


 కేజిఎఫ్ రెండు భాగాలతో తన టాలెంట్ ఏంటో నిరూపించుకున్న ప్రశాంత్ నీల్ ప్రస్తుతం స్టార్ హీరోలతో సినిమాలు చేయడానికి అవకాశాలు దక్కించుకున్నాడు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సలార్ అనే సినిమా చేస్తున్నాడు  ఈ సినిమాపై భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి అని చెప్పాలి. అయితే సలార్ సినిమా తర్వాత మరో స్టార్ హీరో అయినా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చింది అన్న విషయం తెలిసిందే.



 అయితే ఎన్టీఆర్ సినిమా విషయంలో మరింత పక్క ప్లాన్ తో ఉన్నాడట ప్రశాంత్ నీల్. కేజీఎఫ్, సలార్ సినిమాల కంటే ఉన్నతమైన నిర్మాణ విలువలతో చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నాడట. త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత అటు ఎన్టీఆర్ కి పాన్ ఇండియా లెవెల్లో విపరీతమైన మాస్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఈ క్రమంలోనే తారక్ తో ప్రశాంత్ నీల్ చేయబోయే స్క్రిప్ట్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. ఇక ఈ సినిమాలో పాతకాలం రాజుల నాటి చరిత్రను కూడా చూపించబోతున్నాడట. ఇక మహారాజు పాత్రలో ఎన్టీఆర్ కు సంబంధించిన పాత్ర ఉండబోతుందట. అయితే సలార్ షూటింగ్ సమయంలో తారక్ తో ప్రశాంత్ నీల్ చేయబోయే స్క్రిప్ట్ కొంత భాగం విని ప్రభాస్ ఆశ్చర్య పోయాడట. ఈ కథ తారక్కు బాగా సరిపోతుందని అభిప్రాయపడ్డాడట ప్రభాస్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: