హాట్ టాపిక్ గా మారిన సుధీర్ బాబు సాహసం !
ఇలాంటి పరిస్థితుల మధ్య విడుదల అవుతున్న మూవీ ‘మాయమశ్చoద్ర’ నటుడు రైటర్ హర్ష వర్ధన్ దర్శకత్వం వహించిన సినిమాకు సంబంధించి ఇప్పటివరకు విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ లకు మంచి స్పందన వచ్చింది. అయితే కొన్ని నెలల నుంచి సైలెంట్ గా ఉన్న ఈమూవీ మేకర్స్ ఇప్పుడు తమ స్పీడ్ పెంచి ఈమూవీ రిలీజ్ డేట్ ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు.
ఈమూవీని అక్టోబరు 6న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతానికి సుధీర్ సినిమాకు పెద్దగా పోటీ ఉండక పోయినప్పటికి అక్టోబర్ మూడవ వారం నుండి దసరా సినిమాల రేస్ ప్రారంభం కాబోతోంది. ఈసారి దసరా రేస్ కు బాలకృష్ణ విజయ్ రవితేజాలు పోటీపడుతున్న పరిస్థితులలో ఈసంవతరం దసరా రేస్ చాలా ఆశక్తి దాయకంగా మారింది.
దీనితో ఇన్ని భారీ సినిమాలు క్యూ కడుతుంటే వాటిని పట్టించుకోకుండా సుధీర్ బాబు ఎందుకు ఈసాహసం చేస్తున్నాడు అంటూ ఇండస్ట్రి వర్గాలు షాక్ అవుతున్నాయి. ఈ సినిమాలో సుధీర్ రకరకాల అవతారాల్లో కనిపిస్తాడని వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఈసినిమాకు సంబంధించి బొద్దుగా ఉన్న లుక్‌లో అందరి దృష్టినీ ఆకర్షి స్తోంది. కనీసం ఈసినిమా అయినా సుధీర్ బాబుకు సక్ససస్ ఇవ్వలేకపోతే అతడి కెరియర్ సమస్యలలో పడే ఆస్కారం ఉంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి..