మిస్ శెట్టి - మిస్టర్ పోలిశెట్టి.. అదుర్స్ అనిపించేలా చిరంజీవి రివ్యూ..!!

Divya
నవీన్ పోలిశెట్టి హీరోగా ,అనుష్క శెట్టి హీరోయిన్గా నటించిన తాజా చిత్రం మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి.. ఈ సినిమా ఈనెల 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.చాలా సార్లు ఈ సినిమా కూడా వాయిదా పడిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు పోటీగా జవాన్ సినిమా కూడా విడుదల కాబోతోంది.. దీంతో ఈసారి వెనకడుగు వేయకుండా ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యింది ఈ చిత్రం. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నవీన్ పోలిశెట్టి పలు ప్రాంతాలలో తిరగడం జరిగింది. కానీ అనుష్క మాత్రం ఇప్పటివరకు పెద్దగా ప్రమోషన్స్లో అయితే కనిపించలేదు.


కానీ నవీన్ మాత్రం ఈ సినిమాకు మంచి బాక్సాఫీస్ ఓపెనింగ్స్ రాబట్టాలని పలు ప్రయత్నాలు చేస్తున్నారు. గత నెల రోజుల నుంచి అన్ని రకాల ప్రమోషన్స్ చేస్తూనే ఉన్నారు ఇప్పటికే ఆంధ్రలో చాలా ఏరియాలో తిరగడమే కాకుండా రీసెంట్ గా కొన్ని కాలేజీలలో కూడా యువతను ఆకట్టుకునే విధంగా పలు రకాల స్పీచ్ లు ఇవ్వడం జరిగింది. ట్రైలర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాకి కాస్త బూస్ట్ ఇచ్చే విధంగా చిరంజీవి సోషల్ మీడియా ద్వారా తన రివ్యూ ను ఈ సినిమాకు సంబంధించి విడుదల చేయడం జరిగింది.

మిస్ శెట్టి -మిస్టర్ పోలిశెట్టి సినిమా చూశాను మొదటి నుంచి చివరిదాకా ఎంతగానో ఆకట్టుకున్న ఈ సినిమా హీలిరియస్ ఎంటర్టైన్మెంట్ నేటి యువతకు బాగా కనెక్ట్ అయ్యేలా ఉన్నది.. సరికొత్త కథ అంశంతో జాతి రత్నాలకు మరింత రెట్టింపు ఎనర్జీ వినోదాన్ని అందించేందుకు నవీన్ పోలిశెట్టి.. కాస్త గ్యాప్ తర్వాత కనిపిస్తున్న మరింత బ్యూటిఫుల్ అనుష్క శెట్టి ఈ చిత్రానికి ప్రాణం పోశారని తెలిపారు.. ఫుల్ లెన్త్ ఎంటర్టైన్మెంట్ సినిమా అని ఒక ట్విట్టర్ సైతం షేర్ చేయడం జరిగింది చిరంజీవి. డైరెక్టర్ మహేష్ బాబును కూడా అభినందించాలి అంటూ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: