ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప టు సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇక పుష్ప సినిమాకి గాను జాతీయ అవార్డు రావడంతో బన్నీ రేంజ్ ఇప్పుడు ఏ స్థాయికి వెళ్ళిపోయిందో మనందరికీ తెలిసిందే. ఇక పుష్ప 2 సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా దాదాపు 1000 కోట్ల బిజినెస్ జరగబోతోంది అన్నట్టు కూడా వినిపిస్తోంది .అయితే ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ మరియు త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఒక సినిమా చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఈ కాంబినేషన్ లో మూడు సినిమాలు వచ్చాయి.
దీంతో ఇప్పుడు నాలుగు సారి కూడా ఈ కాంబినేషన్ హిట్ అవుతుంది అని బలంగా నమ్ముతున్నారు అభిమానులు. అయితే ఈ విషయాలన్నీ పక్కన పెడితే బన్నీకి తెలుగులోనే కాకుండా మిగతా అన్ని భాషల్లో కూడా ఫాన్స్ ఉన్నారు .ముఖ్యంగా కోలీవుడ్ హాలీవుడ్ లలో బన్నీకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఆయా అభిమానులు ఎప్పటినుండో కోరుతున్నారు. కానీ మంచి కథ కోసం ఎదురు చూస్తున్న బన్నీ ఇప్పటివరకు అక్కడ సినిమాలు చేయడం కుదర కుదరట్లేదు. అయితే తాజాగా అందుతున్న సమాచారం
ప్రకారం ప్రస్తుతం బన్నీ చుట్టూ ఒక కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ కదపట్టుకుని తిరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక అతడు ఎవరో కాదు అట్లీ రాజా రాణి సినిమాతో వెనక్కి తిరిగి చూసుకోకుండా జవాన్ సినిమా చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు ఆయన. ఇక ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే బన్నీకి మంచి కథతో కోలీవుడ్ కి తీసుకురావాలని ఆయన ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక బన్నీకి ఈ విషయం చెప్పిన తర్వాత కథ వినడానికి బన్నీ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. కనుక కథ ఓకే అయితే వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రావడం పక్కా..!!