టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ లో సెలబ్రెటీలుగా కొనసాగుతున్న వారందరూ ప్రస్తుతం బ్యాచిలర్ లైఫ్ నీ వీడి కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా హీరో శర్వానంద్ ఇటీవల వివాహం చేసుకున్నారు. అనంతరం మరోక యంగ్ హీరో వరుణ్ తేజ్ సైతం ఎంగేజ్మెంట్ చేసుకొని త్వరలోనే పెళ్లికి రెడీగా ఉన్నాడు. తాజాగా ఇప్పుడు కమీడియన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకొని సీరియల్స్ సినిమాలో ఉంటూ మరింత గుర్తింపును తెచ్చుకున్న మహేష్ విట్టా సైతం తాజాగా వివాహం చేసుకున్నాడు. బిగ్ బాస్ 3 కంటెస్టెంట్ గా గుర్తింపుని తెచ్చుకున్న
ఆయన యూట్యూబ్లో వెబ్ సిరీస్ ఫన్ బకెట్ ద్వారా పరిచయమై సినిమాల్లో కమెడియన్గా చేశాడు. చిత్తూరు యాసలో అతను పలికే డైలాగ్ లు అందరినీ కడుపుబ్బ నవ్విస్తాయి అలా నాని నటించిన కృష్ణార్జున యుద్ధం సినిమాలో అవకాశం లభించడంతో మరింత గుర్తింపు తెచ్చుకున్నాడు. అనంతరం శమంతకమణి టాక్సీవాలా నిన్ను వీడని నేను అల్లుడు అదుర్స్ చలో ఎక్స్ప్రెస్ వంటి చాలా సినిమాల్లో కమెడియన్గా నటించిన పాత్ర మొదట మహేష్ కి లభించింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ అవకాశాన్ని వదులుకోవాల్సి వచ్చిందట. అయితే ఇటీవల రహస్యంగా వివాహం చేసుకున్నాడు.
ఆయన ఈ నెల రెండవ తేదీన శ్రావణి అనే అమ్మాయిని కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్నాడు. ఇక వీరిద్దరి వివాహం కడప జిల్లా ప్రొద్దుటూరు లోని హెల్త్ క్లబ్ ఫంక్షన్ లో బంధుమిత్రుల సమక్షంలో జరిగింది. శ్రావణి మహేష్ చెల్లెలి ఫ్రెండ్ కావడంతో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. అనంతరం ప్రేమగా మారి పెద్దలను ఒప్పించే పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వారికి సంబంధించిన పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ విషయం తెలిసిన ఆయన అభిమానులు షాక్ అవుతున్నారు. ఎవరికీ చెప్పకుండా ఇంత సడన్గా ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అని ఆయన షేర్ చేసిన ఫోటోల కింద కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు మరికొందరు కొత్త దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు..!!