20 ఏళ్ల తర్వాత ఆ స్టార్ హీరో పక్కన హీరోయిన్గా స్నేహ..!?

Anilkumar
సినీ ఇండస్ట్రీ అంటేనే మాయాలోకం.. రంగుల ప్రపంచం.. ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరి టైం ఎప్పుడు ఎలా మారుతుందో అన్నది ఎవరు ఊహించలేరు.. ప్రతిసారి హీరోయిన్ ల కి నెగిటివ్ జరుగుతుందని చెప్పలేము.. పాజిటివ్ జరుగుతుంది అని కూడా చెప్పలేము.. ఇక దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకప్పటి స్టార్ హీరోయిన్ స్నేహ అని చెప్పాలి. సినీ ఇండస్ట్రీ అంటే గ్లామరస్ ప్రపంచం అని అందరూ భావిస్తారు. గ్లామర్ గా కనిపించడం అంటే చిట్టి పొట్టి బట్టలు వేసుకొని ఎద భాగాలను ఎక్స్పోజ్ చేయడమే కాదు పట్టు చీరలో మహాలక్ష్మిలా కనిపించి అభిమానులను ఆకట్టుకోవడం అని ప్రూఫ్ చేసింది ఈ హీరోయిన్ స్నేహ..

సినీ ఇండస్ట్రీకి వచ్చి ఎన్నో ఏళ్లు అవుతున్నప్పటికీ ఇప్పటివరకు ఒక్క ఎక్స్పోజింగ్ కూడా చేయలేదు స్నేహ. ఇక ఇప్పుడున్న గ్లామరస్ స్టార్ హీరోయిన్లకు మించే ఫ్యాన్ ఫాలోయింగ్ స్నేహాది అని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం లేదు. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో సైతం తనదైన స్టైల్ లో మంచి మంచి సినిమాల్లో అవకాశాలను దక్కించుకుంటూ ప్రస్తుతం వరుస సినిమాలో చేస్తోంది స్నేహ.. అయితే అలాంటి స్నేహకు మళ్ళీ ఇప్పుడు ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది అన్న సమాచారం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది.

ఇక కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్న విజయ్ దళపతి 68 గా వస్తున్న సినిమాలో హీరోయిన్గా స్నేహ సెలెక్ట్ అయింది అన్న సమాచారం వినబడుతోంది. వెంకట్ ప్రభూ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో విజయ్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే విజయ్ కి భార్యగా స్నేహని మేకర్స్ తీసుకోవాలని భావించినట్లుగా తెలుస్తోంది. దాదాపు 20 ఏళ్ల తర్వాత మళ్లీ వీళ్ళిద్దరి కాంబినేషన్ రావడంతో వీరిద్దరి అభిమానులు తెగ ఖుషి అవుతున్నారు . దాంతో పాటు సినీ ఇండస్ట్రీలో విజయ్ మరియు స్నేహ కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దీంతో వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పుడు వస్తున్న సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: