
ప్రభాస్ రిలీజ్ డేట్ ని లాక్ చేసుకున్న రూల్స్ రంజాన్..!!
ఈ సినిమాని రత్నం కృష్ణ దర్శకత్వం వహించారు.. రూల్స్ రంజన్ పై ప్రేక్షకులలో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.. ఇప్పటికి విడుదలైన ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా ఈ చిత్రంలోని పాటలు కూడా విశేష స్పందన లభించింది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటున్నట్లు తెలుస్తోంది .ఇందులో మెహర్ చాహల్, వెన్నెల కిషోర్, సుబ్బరాజు, హైపర్ ఆది, వైవ హర్ష వంటి వారు కీలకమైన పాత్రల నటిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 28న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.
అందుకు సంబంధించి ఒక పోస్టర్ కూడా వైరల్ గా మారుతుంది ఇందులో నేహా శెట్టి, కిరణ్ అబ్బవరం చాలా క్లాసికల్ లుక్ ఆకట్టుకుంటున్నారు.. అయితే సెప్టెంబర్ 28వ తేదీన పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన సలార్ సినిమా విడుదల చేస్తున్నట్లు గతంలో వార్తలు వినిపించాయి.. అయితే గత కొద్ది రోజులుగా సలార్ సినిమా వాయిదా పడుతున్నట్లు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. దీంతో రూల్స్ రంజాన్ సినిమా అదే తేదీకి విడుదల చేయబోతున్నట్లు సైతం మేకర్స్ ప్రకటించారు దీంతో సలార్ సినిమా వాయిదా పడినట్టే అంటూ పలువురు అభిమానులు సైతం ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. మరి ఏ మేరకు ఈ విషయం పైన సలార్ బృందం స్పందిస్తుందో చూడాలి మరి.