ఏంటి.. ఖుషి మూవీ లో ముందు ఆ హీరోయిన్ని అనుకున్నారా..!?

Anilkumar
వరల్డ్ వైడ్ గా సెప్టెంబర్ 1న ఖుషి సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుని దూసుకుపోతుంది. కాగా ఈ సినిమాలో విజయ్ దేవరకొండ మరియు సమంతల మధ్య రొమాన్స్ ఈ సినిమాకి ప్లస్ అయ్యింది అని అంటున్నారు సినిమా చూసిన వారందరూ. దానితోపాటు శివ నిర్వణా దర్శకత్వం.. దాంతోపాటు ఈ సినిమా మ్యూజిక్ అన్ని ఈ సినిమాకి బాగా ప్లస్ అయ్యాయి అన్న టాక్ వినబడుతుంది. ఇక సమంత గతంలో నటించిన యశోద సినిమా కాస్త హిట్ అయినప్పటికీ ఆ తర్వాత వచ్చిన శాకంతులం సినిమా  డిజాస్టర్ గా మారింది.

 కానీ ఖుషి సినిమా మాత్రం మళ్లీ సమంత కి బ్లాక్ మిస్టర్ విజయాన్ని అందించింది. కానీ విజయ్ దేవరకొండ కు మాత్రం దాదాపుగా 5 సంవత్సరాలపాటు సరైన హిట్ లేక సతమతమవుతున్నాడు. గీతాగోవిందం సినిమా తర్వాత మళ్లీ ఇప్పటివరకు అలాంటి హిట్ సినిమా లేదు. ఇక ఆ సినిమా తర్వాత ఆ రేంజ్ లో హిట్ అయిన సినిమా ఖుషి. దాంతో విజయ్ దేవరకొండ సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ని సైతం షేర్ చేయడం జరిగింది. దాంతోపాటు ఖుషి సినిమా సక్సెస్ అవ్వడంతో యాదాద్రి నరసింహస్వామి ని కూడా ఇటీవల దర్శించుకున్నాడు ఆయన.

అయితే ఖుషి సినిమాలో మొదట హీరోయిన్గా సమంతని కాకుండా మరొక హీరోయిన్ ని అనుకున్నాడు దర్శకుడు. ఇక ఆ హీరోయిన్ మరెవరో కాదు రష్మిక మందన. కానీ చివరి నిమిషంలో రష్మిక మందనాన్ని తీసేసి సమంతని ఇందులో హీరోయిన్గా పెట్టినట్లుగా తెలుస్తోంది. అయితే దానికి ప్రధాన కారణం రష్మిక మందన మరియు విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో ఇప్పటికే రెండు మూడు సినిమాలు వచ్చాయి .కాగా ఈ సినిమాలో విజయ్ దేవరకొండ రష్మిక మధ్య రొమాన్స్ సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి. ఇక మళ్ళీ ఇప్పుడు ఖుషి సినిమాలో కూడా వీరిద్దరిని పెట్టి రొమాంటిక్ సన్నివేశాలు తీస్తే జనాలకి అంతగా నచ్చకపోవచ్చు అన్న ఉద్దేశంతో ఇందులో సమంతని పెట్టినట్లుగా తెలుస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: