సలార్ చిత్రం బృందంపై.. ఫ్యాన్స్ ఫైర్..!!

Divya
ప్రభాస్ ,డైరెక్టర్ ప్రశాంత్ నిల్ కాంబినేషన్లో వస్తున్న సలార్ సినిమా మోస్ట్ అవైడెడ్ చిత్రంగా పేరు సంపాదించింది.. వీరి కాంబినేషన్లో వస్తున్న మొదటి సినిమా కావడంతో మంచి హైప్ ఏర్పడుతోంది. ఇందులో శృతిహాసన్, జగపతిబాబు, పృధ్విరాజ్ సుకుమార్, శ్రియ రెడ్డి నటిస్తూ ఉన్నారు.. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో హొంబలే ఫిలిం బ్యానర్స్ వారు భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ సినిమా ఈ నెల 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అనే విషయాన్ని ప్రకటించడం జరిగింది.

అయితే గత కొద్ది రోజులుగా ఈ సినిమా వాయిదా పడ్డట్టుగా వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ విషయం పైన చిత్ర బృందం ఇంతవరకు క్లారిటీ ఇవ్వకపోవడంతో అభిమానుల సైతం కాస్త కోపంగా ఉండటమే కాకుండా కలత చెందినట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా బ్యానర్ హోంబలే  బ్యానర్ పైన కూడా చాలా ఫైర్ అవుతున్నారు ప్రేక్షకులు. వాయిదా మరియు కొత్త విడుదల తేదీకి సంబంధించిన విషయాన్ని సైతం ఏవిధంగా ప్రకటించకపోవడంతో అభిమానులు చాలా నిరుత్సాహంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఇప్పుడైనా ఈ విషయం పైన చిత్ర బృందం స్పందించి అభిమానులను కూల్ చేస్తారేమో చూడాలి మరి.


సలార్ సినిమాని రెండు భాగాలుగా తెరకెక్కిస్తూ ఉన్నారు డైరెక్టర్ ప్రశాంతి నిల్.. మొదట బాగా నవంబర్ 28వ తేదీన విడుదల చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ప్రభాస్ నటించిన మరొక చిత్ర విషయానికి వస్తే కల్కి.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు.. ఇందులో దీపికా పదుకొనే, దిశా పటాని సైతం నటిస్తూ ఉన్నారు.. విధంగా కమలహాసన్ నటించిన పాత్రలో అమితాబ్ బచ్చన్ కూడా నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా కూడా పాన్ వరల్డ్ చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కూడా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దిగబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: