తెలుగు సినీ ఇండస్ట్రీలో రౌడీ హీరోగా తన కంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న విజయ్ దేవరకొండ తాజాగా ఖుషి సినిమాతో మళ్ళీ వీక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఈ సినిమా విడుదలై హిట్ టాక్ తో దూసుకుపోతుంది. కాగా ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమంలో భాగంగా విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస ఇంటర్వ్యూలను ఇవ్వడం కాకుండా సోషల్ మీడియా వేదికగా కూడా తన అభిమానులతో ముచ్చటిస్తున్నాడు. ఇలా ఈ సినిమాని ఒక రేంజ్ లో ప్రమోట్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు విజయ్ దేవరకొండ. ఇందులో భాగంగానే విజయ్ దేవరకొండ తన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటిస్తూ
తన అభిమానులు అడిగే ప్రశ్నలకి సమాధానాలను ఇచ్చాడు. ఈ నేపథ్యంలోనే ఈయన హీరోగా ఇండస్ట్రీకి రావడానికి గల ముఖ్య కారణం ఎవరు అన్న విషయాన్ని తెలియజేశారు. దాంతో ఆయన చేసిన కామెంట్స్ కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.. అయితే విజయ్ దేవరకొండ హీరోగా ఇంటర్వ్యూ ఇవ్వడానికి గల ముఖ్య కారణం మహేష్ బాబు అంటూ విజయ్ తెలియజేశాడు. అలా విజయ్ దేవరకొండ హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు అంటే అది మహేష్ బాబు సపోర్ట్ వల్లే అని అనుకుంటే మాత్రం తప్పే అని అంటున్నారు.
అయితే మహేష్ బాబు మరియు పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన పోకిరి సినిమా సినీ ఇండస్ట్రీలో ఎలాంటి సక్సెస్ అందుకుందో మనందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాలోని మహేష్ బాబు ఎంట్రీ సీన్ విజయ్ దేవరకొండను అమితంగా ఆకట్టుకుంది అని అంటున్నారు. అయితే మహేష్ బాబు ఈ నటించిన ఈ సినిమా చూసిన తర్వాత ఆయన కూడా ఎప్పుడైనా సినీ ఇండస్ట్రీలో ఇలాగే హీరోగా మారాలి అని కోరుకున్నాడట విజయ్ .నిజమైన హీరో అంటే ఇదే అని భావించిన విజయ్ అప్పటి నుండి ఇండస్ట్రీకి రావాలి అని చాలా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాడట. అదే విధంగా తనకి పోకిరి సినిమాలో అవకాశం వస్తే గనుక మహేష్ బాబు ఎంట్రీని మళ్లీ రీ క్రియేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ ఈ సందర్భంగా తెలియజేశారు..!!!