పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా రోజుల క్రితమే హరిహర వీరమల్లు అనే సినిమాను ప్రారంభించిన విషయం మన అందరికీ తెలిసిందే. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ అనుకున్నంత వేగంగా జరగడం లేదు. దానితో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యి ఇప్పటికే చాలా కాలం అవుతున్న ఈ మూవీ షూటింగ్ ఇప్పటికీ పూర్తి కాలేదు. ఇకపోతే ప్రస్తుతం పవన్ రాజకీయాల పై మరియు అలాగే కొన్ని సినిమాలపై ఇంట్రెస్ట్ చూపిస్తూ రావడంతో ఈ సినిమా షూటింగ్ మరింత డిలే అవుతూ వస్తుంది.
ఇకపోతే ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను మరియు ఓ గ్లిమ్స్ వీడియోను విడుదల చేసిన విషయం మనకు తెలిసిందే. వీటికి ప్రేక్షకుల నుండి సూపర్ సాలిడ్ రెస్పాన్స్ లభించింది ఇది ఇలా ఉంటే రేపు అనగా సెప్టెంబర్ 2 వ తేదీన పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు అన్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే పవన్ పుట్టిన రోజు సందర్భంగా హరిహర వీరమల్లు మూవీ బృందం ఈ సినిమా నుండి ఓ అదిరిపోయే పోస్టర్ ను విడుదల చేసే అవకాశం ఉంది అని చాలా రోజులుగా ఓ వార్త వైరల్ అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే.
ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం సెప్టెంబర్ 2 వ తేదీన మధ్యాహ్నం 12 గంటల 17 నిమిషాలకు హరిహర వీరమల్లు మూవీ నుండి ఓ బ్రా న్యూ పోస్టర్ ను విడుదల చేయబోతున్నాం అంటూ అధికారికంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఇకపోతే ఈ సినిమాకు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తూ ఉండగా ... నీది అగర్వాల్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఎం ఎం కీరవాణి ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు.