ప్రమోషన్స్ కి దూరంగా అనుష్క.. కారణం అదేనా?

praveen
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న అనుష్క గురించి తెలుగు పరీక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ మన్మధుడు, నాగార్జున హీరోగా నటించిన సూపర్ సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ.  తర్వాత తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. అయితే దశాబ్ద కాలం గడిచిపోతున్న ఇంకా యంగ్ హీరోయిన్లకు పోటీ ఇస్తూనే ఉంది. ఇక సైజ్ జీరో అనే సినిమా ద్వారా కాస్త బరువు ఎక్కి చివరికి కెరియర్ను చేజేతులారా  ప్రమాదంలో పడేసుకుంది అనుష్క.

 ఇక ఆ తర్వాత సినిమాల్లో పెద్దగా అవకాశాలు లేకపోవడంతో లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించేందుకు ప్రయత్నిస్తుంది. అయితే చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు యంగ్ హీరో నవీన్ పోలిశెట్టితో కలిసి ఒక సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతుంది. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి పేరుతో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది అని చెప్పాలి. ఇక ఈ సినిమా విడుదల దగ్గర పడుతున్న నేపథ్యంలో అటు చిత్రబంధం మొత్తం ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉన్నారు.

 ఇక ఎక్కడ చూసినా హీరో నవీన్ పోలిశెట్టి ప్రమోషన్స్ లో కనిపిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. అయితే అటు అనుష్క మాత్రం ఎక్కడ ప్రమోషన్స్ కి పాల్గొనక పోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది. కాగా అనుష్క ప్రమోషన్స్ కి రాకపోవడానికి కారణం ప్రభాస్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయ్. ప్రభాస్ తో అనుష్కకు చాలా కాలంగా మంచి సాన్నిహిత్య సంబంధం ఉంది. అయితే అనుష్క ఎక్కడికి వెళ్ళినా ప్రభాస్ గురించి అడుగుతూ ఉంటారు. ఇలాంటి విచారణ పక్కన పెట్టాలని అనుష్క ప్రమోషన్స్ కి దూరంగా ఉందట. ఇటీవల కాలంలో మీడియా ప్రతినిధులు సినీ సెలబ్రిటీలను కాస్త ఒక అడుగు ముందుకు వేసి ప్రశ్నలు అడుగుతుండంతో అలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడం ఇష్టం లేకనే అనుష్క ప్రమోషన్స్ కి దూరంగా ఉందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: