ఉప్పెన విలన్ విజయ్ సేతుపతి.. అసలు కూతుర్ని చూశారా?
తెలుగు చిత్ర పరిశ్రమలో వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఉప్పెన సినిమాలో హీరోయిన్ కృతి శెట్టి పోషించిన బేబమ్మ పాత్రకు తండ్రిగా ఊరికి పెద్దగా విజయ్ సేతుపతి నటించాడు అని చెప్పాలి. ఇక ఆ పాత్రలో ఒదిగిపోయిన విజయ్ సేతుపతి అదరగొట్టేసాడు. ఇక ఆ తర్వాత తెలుగులో వరుసగా అవకాశాలు అందుకోవడం మొదలుపెట్టాడు అని చెప్పాలి. అయితే రియల్ లైఫ్ లో విజయ్ సేతుపతి కూతురు ఎవరు అంటే ఇంకెవరు ఉప్పెనలో ఉన్న బేబమ్మా అని చెబుతారు. కానీ రియల్ లైఫ్ లోకి విజయ్ సేతుపతి కూతురు గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.
అయితే ఇటీవల ఓనం పండుగ సందర్భంగా విజయ్ సేతుపతి తన పిల్లలతో దిగిన ఫోటోనే అభిమానులు అందరితో కూడా పంచుకున్నాడు. అయితే ఈ సినిమాలో విజయ్ సేతుపతి కొడుకుతోపాటు కూతురు కూడా కనిపిస్తోంది అని చెప్పాలి. అయితే విజయ్ కొడుకు సూర్య కొద్దో గొప్పో కొంతమందికే తెలుసు. ఎందుకంటే సూర్య చైల్డ్ ఆర్టిస్టుగా సినిమాల్లో కనిపించాడు. అయితే విజయ్ కూతురు శ్రీజ గురించి మాత్రం ఎవరికి తెలియదు. దీంతో ఈ ఫోటో చూసి ఆయనకు నిజంగా కూతురు ఉందా అని ఎంతో మంది షాక్ అవుతున్నారు. అయితే ఆమె కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాలు చేసింది. ఎవరికి ఈ విషయం తెలియదు. ఇక ఇప్పుడు ఈ ఫోటో చూసి అందరూ షాక్ అవుతున్నారు.