భగవంత్ కేసరి చిత్రం నుంచి చిచ్చా వచ్చేది అప్పుడే..?

Divya
నందమూరి బాలకృష్ణ హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న తాజా చిత్రం భగవంత్ కేసరి.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ అనిల్ రావుపూడి దర్శకత్వం వహించారు.. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకి ఈ చిత్రాన్ని తీసుకురావడం జరిగింది.. ఇప్పటివరకు బాలయ్య వరుస హిట్ల తో మంచి ఊపు మీద ఉన్నారు. ఈ సినిమాతో కచ్చితంగా హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవాలని గట్టిగా ఫిక్స్ అవుతున్నట్లు తెలుస్తోంది. అందుకోసమే చిత్ర బృందం కూడా భారీగానే కష్టపడుతున్నట్లు సమాచారం. బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించి ఒక చిన్న వీడియోని విడుదల చేయడం జరిగింది. ఈ వీడియోలో బాలయ్య లుక్స్ అందరిని ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.


ఇక ఇప్పుడు మ్యూజికల్ ట్రీట్ ను కూడా చిత్ర బృందం సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ కి ముహూర్తం ఫిక్స్ చేశారు.. సెప్టెంబర్ ఒకటవ తేదీన సాయంత్రం 4:05 నిమిషాలకు ఫస్ట్ సింగిల్ లిరికల్ను వీడియో విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.ఈలోగా ఫస్ట్ సింగిల్ కి సంబంధించిన ప్రోమో కూడా విడుదల చేయడం జరిగింది. ఈ ప్రోమోలో వినాయక చవితి పండుగ సంబరాలు జరుగుతున్నట్టుగా కనిపిస్తున్నాయి. అలాగే బాలయ్య, శ్రీలకూడా అక్కడ అందరితో కలిసి డాన్సులు వేస్తున్నట్టుగా కనిపిస్తోంది.



అయితే బాలయ్య వచ్చి సౌండ్ సరిగ్గా లేదని వెంటనే శ్రిలిల ను బిడ్డ అని పిలిచి చప్పుడు గట్టిగా చేయమను అంటూ గట్టిగా అరుస్తాడు.. ఆ వెంటనే శ్రీ లీల కూడా మీ తీన్మార్ పక్కన పెట్టండి మా చిచ్చా వచ్చాడు అంటూ అక్కడితో ప్రోమో ముగిస్తుంది. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా థమన్ అందిస్తూ ఉన్నారు. భారీ యాక్షన్  సినిమాగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. స్టైలిష్ గా ఇందులో బాలయ్య శ్రీల కూడా కనిపిస్తూ ఉన్నారు. వీరిద్దరూ తెలంగాణ యాసలో చెప్పే డైలాగులు కూడా ఈ ప్రోమోకి హైలైట్ గా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: