చిరంజీవి షాకింగ్ డెసిషన్.. అభిమానులు ఫుల్ హ్యాపీ?
తమిళ హిట్ మూవీ వేదాలంకు తెలుగు రిమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది అన్న విషయం తెలిసిందే. దీంతో మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికైనా రీమేక్ సినిమాలను చేయడం.. ఆపాలని అభిమానులు అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. అయితే బోలా శంకర్ ఫ్లాప్ తో అటు చిరంజీవి కూడా రీమేక్స్ సినిమాల విషయంలో కాస్త ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇతర భాషల సినిమాలను రీమేక్ చేయడం విషయంలో మెగాస్టార్ చిరంజీవి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకనుంచి ఇక రిమేక్ సినిమాల జోలికి పోవద్దు అని చిరంజీవి అనుకుంటున్నారట.
ఈ విషయం కాస్త ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే ఇటీవల ఒక నిర్మాత మలయాళ సూపర్ హిట్ సినిమా రీమేక్ రైట్స్ ని పట్టుకుని చిరంజీవిని కలిశారట. అయితే ఇప్పటికే భోళాశంకర్ తో ఫ్లాప్ చవిచూసిన చిరంజీవి.. ఇక మరో రీమేక్ చేయడానికి సిద్ధంగా లేరు. దీంతో ఆ నిర్మాతకు నిర్మొహమాటంగా నో చెప్పేసారట చిరంజీవి. ఇకపై రీమెక్ సినిమాలను చేయను అని నిర్మాతకు చెప్పేశారట. ఇక ఈ విషయం తెలిసి అభిమానుల ఆనందానికైతే అవధులు లేకుండా పోయాయి. ఒకప్పటిలా చిరంజీవి మళ్లీ కొత్త కథలతో ప్రేక్షకులు ముందుకు వస్తే సూపర్ హిట్ సాధించడం ఖాయమని ఎంతో మంది ఫ్యాన్స్ కూడా భావిస్తున్నారు.