సలార్: రెబలోడి రికార్డులు నాన్ స్టాప్?

Purushottham Vinay
పాన్ ఇండియా స్టార్ రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో సలార్ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అనౌన్స్ చేసిన నాటి నుండి అంచనాలు కూడా తారాస్థాయిలో నెలకొన్నాయి.రీసెంట్ గా రిలీజైన గ్లిమ్ప్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది.ఈ సినిమా కోసం ప్రశాంత్ నీల్ యాక్షన్ సీక్వెన్స్ లను చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నాడని టాక్ వినిపిస్తున్న నేపథ్యంలో ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఇదిలా ఉండగా రిలీజ్ కి ముందే సలార్ సినిమా ఎన్నో సూపర్ రికార్డులు క్రియేట్ చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్ పరంగా హయ్యెస్ట్ రేట్స్ సొంతం చేసుకున్న ఈ సినిమా యూఎస్ లో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ లో జెట్ స్పీడ్ లో దూసుకుపోతోంది.యూఎస్ అడ్వాన్స్ బుకింగ్స్ లో ఇప్పటికే సలార్ 3 కోట్లకు దాకా వసూలు చేసిందని, అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా ఇండియన్ సినిమాకి ఇదే హయ్యెస్ట్ నంబర్ అని సమాచారం వినిపిస్తోంది.



సెప్టెంబర్ 28 వ తేదిన రిలీజ్ కానున్న ఈ సినిమా రిలీజయ్యాక ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో అన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి.ఇంకా ఈ సినిమాకి ఈ రేంజ్ లో బిజినెస్ జరగటానికి ప్రధాన కారణం హీరో, డైరెక్టర్ కాంబినేషన్ అని చెప్పవచ్చు. ప్రశాంత్ నీల్ గత చిత్రం కేజిఎఫ్2 సినిమా సుమారు 1200 కోట్ల వసూళ్లు రాబట్టగా ప్రభాస్ కి బాహుబలి తర్వాత పాన్ ఇండియా వైడ్ మార్కెట్ ఏర్పడ్డ కారణంగా ఆదిపురుష్ లాంటి డిజాస్టర్ తర్వాత కూడా బయ్యర్లు ఈ రేంజ్ లో రేట్స్ పెట్టడానికి సాహసం చేస్తున్నారు. మరి రిలీజ్ కి ముందు నుండే రికార్డులు క్రియేట్ చేస్తున్న సలార్ సినిమా విడుదలయ్యాక ఏ రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.ఈ సినిమా ట్రైలర్ ని సెప్టెంబర్ 3 లేదా 7 న రిలీజ్ చేయనున్నట్టు సమాచారం తెలుస్తుంది. సెప్టెంబర్ 17 న ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 28 వ తేదీన ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ అవ్వనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: